BigTV English

Sailesh Kolanu: షూటింగ్లో నాని తలకు గాయం.. విస్తుపోయే నిజం బయటపెట్టిన డైరెక్టర్..!

Sailesh Kolanu: షూటింగ్లో నాని తలకు గాయం.. విస్తుపోయే నిజం బయటపెట్టిన డైరెక్టర్..!

Sailesh Kolanu:నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా వచ్చిన ‘హిట్’ సినిమాతో డైరెక్టర్ శైలేష్ కొలను ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించిన ఈయన.. ఆ తర్వాత అడివి శేషు (Adivi shesh) తో ‘హిట్ 2’ చేసి సక్సెస్ కొట్టారు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పుడు నాని(Nani) తో కలిసి హిట్ 3 చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపు రూ.82 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా.. త్వరలో రూ.100 కోట్ల గ్రాస్ దాటుతుందని మేకర్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటిసారి నాని చాలా వైలెంట్ గా కనిపించాడు. అంతేకాదు ఈ పాత్ర కోసం నాని ఎంతో కష్టపడ్డాడు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శైలేష్ కొలను తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.


హిట్ 3 షూటింగ్లో నాని తలకు గాయాలు..

ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. శ్రీనగర్ లో ఒక ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నాము అప్పుడు కెమెరా నాని తలకు తగిలి రక్తం కారింది. రక్తం గడ్డ కట్టేలా చేసి ఆ తర్వాత షూటింగ్ పూర్తి చేశాడు. షూట్ అవ్వగానే ఢిల్లీకి రాత్రికి రాత్రి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఉదయాన్నే వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు. నాని డెడికేషన్ అలా ఉంటుంది అంటూ నాని డెడికేషన్ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ లో కూడా పెట్టారు. అంతేకాదు కొన్ని ఫోటోలు కూడా పంచుకోవడం జరిగింది.


ఫోటోలు పంచుకున్న శైలేష్ కొలను..

శైలేష్ కొలను తన పోస్టు ద్వారా నాని ఒక షూట్ లో కొంతమందిని కొడుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా కెమెరాకు నాని తల తగలడంతో నాని నుదురు మీద చీలుకుపోయి రక్తం కూడా వచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ ని ఇప్పుడు శైలేష్ కొలను పోస్ట్ చేశాడు. నాని నుదురు మీద అయిన గాయాల ఫోటోలలో.. అక్కడ కుట్లు కూడా వేసినట్లు మనం గమనించవచ్చు. ఇక ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నేను చెప్పింది దీని గురించే. ఈ దెబ్బ తగిలిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ షాట్ కి రెడీ అయ్యాడు. సినిమా పట్ల మీకున్న ప్రేమ వ్యాధి లాంటిది. ప్రపంచంలో ఉన్న గౌరవం అంతా కూడా మీకే దక్కాలి. మీతో పాటు నన్ను ప్రయాణించేలా చేసినందుకు ధన్యవాదాలు. హిట్ 3 నా జర్నీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లవ్ యు నాని అంటూ నాని పై ఉన్న ప్రేమను రాసుకొచ్చారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నానికి సినిమా అంటే ఇంత పిచ్చి ఏంటి? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇతడి డెడికేషన్ కి పలువురు నెటిజన్లు కూడా ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.

also read:Nani: ఆ ఒక్క సంఘటన నా జీవితాన్ని మార్చేసింది.. ఆ పాప కోసమే..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×