SSMB 29: కొన్ని సినిమాలు మొదలవ్వక ముందే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేస్తాయి. అలా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’పైనే ఉంది. మహేశ్ బాబు, రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నారు అనగానే ప్రేక్షకుల్లో మొదలైన ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. అందుకే అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరిలో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ఇక చాలాకాలం మహేశ్ బాబు, రాజమౌళి ఎవరికి వారుగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడం కోసం మూవీ టీమ్ అంతా ఫారిన్‌కు వెళ్లిపోయింది.
ప్రియాంక కన్ఫర్మ్
రాజమౌళి, మహేశ్ బాబు మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఫిక్స్ అయ్యింది. అందుకే నిక్ జోనస్ అనే సింగర్‌ను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక.. చాలాకాలం తర్వాత తిరిగి ఇండియాలో అడుగుపెట్టింది. అంతే కాకుండా హైదరాబాద్‌కు వచ్చింది. అప్పుడే ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’లో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఫిక్స్ అయ్యిందని అందరికీ అర్థమయ్యింది. అంతే కాకుండా తాజాగా రాజమౌళి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని చెప్పడం కోసం మహేశ్ బాబు పాస్‌పోర్ట్ తన దగ్గర పెట్టేసుకునన్నానని హింట్ ఇచ్చారు రాజమౌళి. ఆ పోస్ట్‌కు ప్రియాంక కామెంట్ చేయడంతో అందరికీ మ్యాటర్ ఏంటో అర్థమయ్యింది.
మహేశ్ లేకుండానే
రాజమౌళి (Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రాతో పాటు మేకర్స్ అంతా ప్రస్తుతం కెన్యాకు ప్రయణమయ్యారు. గతేడాది అక్టోబర్‌లో కెన్యాకు వెళ్లి అక్కడ అంబోసెలి నేషనల్ పార్క్‌లో షూటింగ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసి వచ్చారు రాజమౌళి. వచ్చే నెలలో కెన్యాలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. చాలాకాలం పాటు అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. దీనికంటే ముందే హైదరాబాద్‌లోనే మహేశ్ బాబు లేకుండా కొంత షూటింగ్‌ను పూర్తిచేశారు రాజమౌళి. అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ ముగిసింది. దీంతో సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా సాగుతున్నందుకు మేకర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Also Read: హాలీవుడ్ రేంజ్ లో ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్.. చెర్రీ కంటే ఎక్కువే..!
ఇద్దరు మాత్రమే
కెన్యాలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా కీలక సన్నివేశాల్లో పాల్గోనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వీరితో పాటు నటించే ఇతర నటీనటులు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇందులో పలువురు హాలీవుడ్, ఫారిన్ యాక్టర్లు కూడా ఉండనున్నారని మొదటినుండి ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలావరకు ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ షూటింగ్ అంతా ఫారిన్‌లోనే జరగనుందని తెలుస్తోంది. ఇదొక ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా అని ముందే క్లారిటీ ఇచ్చేశారు రాజమౌళి. దీనికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా.. కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.