Tollywood Director : చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డైరెక్టర్స్ గా కొందరు డైరెక్టర్స్ సినిమాల్లో ఒకప్పుడు సినిమాల్లో కూడా నటించారు.. అప్పటిలో తమ నటనతో ఆకట్టుకున్న చాలా మంది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు.. డైరెక్టర్స్ గురించి కొందరు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వాళ్ళు నటించిన సినిమాలు గురించి తెలుసుకొని ఔరా ఈయనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? అందుకు కారణం కూడా ఉంది.. నితిన్ నటించిన హిట్ మూవీ సై లో నటించిన ఈయన ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా? దేశం వ్యాప్తంగానే కాదు.. విదేశాల్లో కూడా ఈ డైరెక్టర్ కు వీరాభిమానులు ఉన్నారు..
స్టార్ హీరోలతో ఈ డైరెక్టర్ తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈయనతో సినిమాలు తీయ్యడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరో గెస్ చేసారా? అవును మీరు అనుకున్న వ్యక్తి కరెక్ట్ ఆయన దర్శక ధీరుడు రాజమౌళినే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన సై మూవీలో రాజమౌళి ఒక సీన్ లో కనిపించారు. వేణు మాదవ్ తో ఆ సీన్ ఉంటుంది. ఆ సినిమాలో హైలెట్ అయ్యింది. సినిమా హిట్ అయ్యింది. ఇక ఈ మూవీనే కాదు ఇంకా కొన్ని సినిమాల్లో నటించి మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక ఈయన గురించి అందరికి తెలుసు. భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత.. ఈయన ఇప్పటివరకు తెరకేక్కించిన ప్రతి మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి.. మగధీర, ఈగ, బాహుబలి సిరీస్ మొన్న వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ.. ఇవన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాయి.. ఇండియన్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఈయన ఒకరు..
ఇకపోతే రాజమౌళి కెరీర్‌లో ఇప్పటి వరకు ఫ్లాప్ మూవీ పడలేదు. కానీ ఈ డాక్యుమెంటరీ వల్ల థియేట్రికల్ పరంగా ఆయనకు మొదటి డిజాస్టర్ ఎదురవుతుందా? అనే చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కానీ రాజమౌళి తన ప్రతి ప్రయత్నాన్ని ఎంతో జాగ్రత్తగా చేస్తారనే నమ్మకం కూడా అందరిలో ఉంది. ఆయన బ్రాండ్ వల్ల కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండవచ్చు. మొత్తానికి, ఈ ప్రయోగం రిస్క్‌గా మారుతుందా, లేక అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచుతుందా అనే విషయంలో ప్రేక్షకుల స్పందన చాలా కీలకం. ఈ నెల 20న థియేటర్లలో విడుదలవుతుంది.. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
ఇక సినిమాల విషయానికొస్తే.. సూపర్ స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అటు మహేష్ కానీ, ఇటు రాజమౌళి కానీ ఈ కొత్త సినిమా కథకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈసారి రాజమౌళి ఎలాంటి కథంశాన్ని ఎంచుకోనున్నారు.? తెరపై మహేష్‌ను ఎలా చూపించనున్నారనేది ఆసక్తిగా మారింది.. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.