BigTV English

Turmeric Face Pack: పసుపులో వీటిని కలిపి రాస్తే.. 5 నిమిషాల్లోనే మెరిసిపోతారు

Turmeric Face Pack: పసుపులో వీటిని కలిపి రాస్తే.. 5 నిమిషాల్లోనే మెరిసిపోతారు

Turmeric Face Packs: పసుపు ఆహారానికి రంగును ఇచ్చే మసాలా మాత్రమే కాదు. ఆరోగ్యంతో పాటు, ఇది మీ చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది చర్మానికి ఒక వరం అని చెప్పవచ్చు. మీరు టానింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదా మొటిమలు మీ అందాన్ని తగ్గిస్తున్నా పసుపుకు సంబంధించిన కొన్ని హోం రెమెడీస్ మీ చర్మానికి చాలా బాగా పనిచేస్తాయి.


పసుపు వాడకం ఖరీదైన సౌందర్య ఉత్పత్తులకు కూడా పోటీని ఇస్తుంది. పసుపుకు సంబంధించిన కొన్ని హోం రెమెడీస్ చర్మానికి చాలా మేలు చేస్తాయి.
పసుపును సరిగ్గా ఉపయోగించినట్లయితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని ఉపయోగించడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా, మచ్చలను తగ్గించడంతో పాటు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా మార్చుకోవచ్చు.

1. పసుపు ,పెరుగు:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజ ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్‌ని తొలగించి మెరిసేలా చేస్తుంది. పసుపు, పెరుగు పేస్ట్‌ని ముఖానికి రాసుకుంటే చర్మానికి పోషణ అందుతుంది. ఫలితంగా మొటిమలు కూడా తగ్గుతాయి.


తయారుచేసే విధానం: ఒక టీస్పూన్ పెరుగులో అర టీస్పూన్ పసుపు వేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2) పసుపు , శనగ పిండి:
శనగపిండిలో చర్మానికి పోషణనిచ్చే విటమిన్లు, పోషకాలు ఉంటాయి. పసుపు, శనగపిండి కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం బిగుతుగా మారి మచ్చలు తగ్గుతాయి.

తయారుచేసే విధానం: రెండు టీస్పూన్ల శనగపిండిలో అర టీస్పూన్ పసుపు, కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3) పసుపు , తేనె:
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలతో పోరాడటానికి సహాయపడతాయి. పసుపు ,తేనె పేస్ట్ చర్మాన్ని తేమగా చేసి మృదువుగా మారుస్తుంది.

తయారుచేసే విధానం:
1 టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ పసుపు వేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4) పసుపు, కలబంద:
కలబందలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఉపశమనం చేస్తాయి. అంతే కాకుండా చికాకును తగ్గిస్తాయి. పసుపు, కలబంద గుజ్జు చర్మానికి పోషణనిచ్చి మెరిసేలా చేస్తుంది.

తయారుచేసే విధానం: ఒక టీస్పూన్ అలోవెరా జెల్‌లో అర టీస్పూన్ పసుపు పొడిని కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5) పసుపు, నిమ్మరసం:

నిమ్మరసం సహజమైన బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మపు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు , నిమ్మరసం చర్మాన్ని టోన్ చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మెరుసేలా చేస్తుంది.

తయారుచేసే విధానం: ఒక టీస్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ పసుపు వేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Also Read: ఎంతటి తెల్లజుట్టు అయినా.. ఇలా చేస్తే క్షణాల్లోనే నల్లగా మారడం ఖాయం

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

పసుపు చర్మంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానిని అప్లై చేసే ముందు ఏదైనా ఒక చోట ప్యాచ్ టెస్ట్ చేయండి.

పసుపుతో అలెర్జీ ఉంటే దానిని ఉపయోగించవద్దు.

ఈ పేస్ట్‌లను ముఖానికి అప్లై చేసిన తర్వాత ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి.

ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.

Tags

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×