Toner For Skin: చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ సీజన్‌లో చల్లని గాలి కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో తయారుచేసిన కొన్ని సహజ టోనర్‌లను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా రోజ్ వాటర్, అలోవెరా జెల్‌తో తయారు చేసిన టోనర్ చర్మానికి లోతైన తేమను అందిస్తుంది. అంతే కాకుండా పూర్తి పోషణను ఇస్తుంది. ఇదిలా ఉంటే బీట్‌రూట్‌తో తయారు చేసిన టోనర్ కూడా చర్మానికి పోషణను అందిస్తుంది.
ఇదే కాకుండా, పాలు, పసుపు టోనర్ చర్మానికి పోషణను అందిస్తుంది. ఈ టోనర్లు చర్మాన్ని హైడ్రేట్ గా, హెల్తీగా, గ్లోయింగ్‌గా ఉంచుతాయి. ఈ టోనర్లను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1.రోజ్ వాటర్, అలోవెరా జెల్ టోనర్:
2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్‌లో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసి, రెండింటినీ బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఇప్పుడు శుభ్రమైన ముఖం మీద ఉదయం, సాయంత్రం స్ప్రే చేయండి. రోజ్ వాటర్ చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. అంతే కాకుండా అలోవెరా జెల్ చర్మానికి లోతైన తేమను అందిస్తుంది.
2. బీట్‌రూట్ , క్యారెట్ టోనర్:
ఒక బీట్‌రూట్, ఒక క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని ఒక కప్పు నీటిలో వేసి ఉడకబెట్టండి. ఈ రసాన్ని వడపోసి చల్లార్చి సీసాలో నింపాలి. తరువాత కాటన్ బాల్ సహాయంతో ముఖంపై అప్లై చేయాలి. బీట్‌రూట్‌లోని సహజ రంగు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా క్యారెట్‌లోని పోషకాలు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.
3. దోసకాయ, పుదీనా టోనర్:
దోసకాయ తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 8-10 పుదీనా ఆకులను ఒక కప్పు నీటిలో 24 గంటలు వేసి దోసకాయ ముక్కలను కలిపి నానబెట్టండి. 24 గంటల తర్వాత, దానిని ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో ఉంచండి. దీన్ని మీ ముఖంపై రోజుకు 1-2 సార్లు స్ప్రే చేయండి. దోసకాయ చర్మానికి చల్లదనాన్ని, పుదీనా తాజాదనాన్ని ఇస్తుంది.
4. పాలు , పసుపు టోనర్:
2 టేబుల్ స్పూన్ల తాజా పాలలో చిటికెడు పసుపు కలిపి టోనర్‌ను కాటన్ బాల్ సహాయంతో ముఖానికి రాయండి. ఈ టోనర్ చర్మానికి తేమను , పోషణను అందించడం ద్వారా బుగ్గలను పింక్‌గా మార్చుతుంది .
5. గ్రీన్ టీ, లెమన్ టోనర్:
ఒక కప్పు సిద్ధం చేసుకున్న గ్రీన్ టీని చల్లార్చి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి రెండింటినీ బాగా మిక్స్ చేసి కాటన్ బాల్ సహాయంతో బుగ్గలపై అప్లై చేయాలి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
Also Read: Hair Oil: ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు.. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
శుభ్రమైన ముఖంపై మాత్రమే టోనర్‌ని అప్లై చేయండి.
టోనర్ తర్వాత, తేలికపాటి మాయిశ్చరైజర్ రాయండి.
చలికాలంలో రోజంతా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు నీటిని తాగుతూ ఉండండి.
ముందుగా సహజ టోనర్‌ని ప్యాచ్ టెస్ట్ చేయండి.
ఈ టోనర్లను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ బుగ్గలు రోజీగా, ఆరోగ్యంగా ఉంటాయి.