Renu Desai second marriage:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ (Renu Desai) ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకో వివాహం చేసుకొని పిల్లలకు జన్మనిస్తే.. రేణూ దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత కోసం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ గతంలో బంధువుల సమక్షంలో ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిందని.. ఆ రింగ్ ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి పేరు కానీ మొహం కానీ బయటకు చూపించలేదు. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి రేణూ దేశాయ్ కి, అలాగే ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి కూడా బెదిరింపులు వెళ్లాయట. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులపై మండిపడింది కూడా.. పవన్ కళ్యాణ్ ను మీరెందుకు ప్రశ్నించలేకపోతున్నారు.. నేనేమో ఇంకో పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఇలా మాట్లాడుతున్నారే నేనేమీ విడాకులు కావాలని కోరుకోలేదు కదా అంటూ తన బాధను అంత ఒక్కసారిగా బయట పెట్టింది రేణూ దేశాయ్.
రెండో పెళ్లి పై రేణూ దేశాయ్ క్లారిటీ..
ఇక కాలం మారేకొద్ది పరిస్థితుల్లో కూడా మార్పులు రావడంతో రెండో పెళ్లి ఆలోచనలను విరమించుకుంది . ఇక పిల్లల బాధ్యత తన మీదే ఉంది కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటే వారిని సరిగ్గా పెంచలేనని, వారి ఆలనా పాలనా చూసుకోవడం కష్టం అవుతుందని, అందుకే అప్పుడే రెండో పెళ్లి వద్దని నిర్ణయించుకుంది అంతేకాదు అకీరా నందన్ పెద్దవాడు కావాలి. ఆద్య తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. ఇక ఇప్పటికే అకీరా పెద్దవాడై పోయాడు. ఆధ్యాకి అప్పుడే 15 సంవత్సరాలు వచ్చాయి. పాపకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన గురించి ఆలోచించుకుంటానని, తాజాగా రెండో పెళ్లిపై స్పందించింది రేణూ దేశాయ్. ఎన్నో సందర్భాలలో నాకంటూ ఒక వ్యక్తి ఉండాలని, నాకంటూ నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలని అనిపించేది. కానీ పిల్లల సైడ్ నుంచి చూస్తే ఇది తప్పుగా అనిపించేది. ముందు పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలి. నిజానికి సింగిల్ పేరెంట్ గా ఉన్నప్పుడే పిల్లల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీకు రెండో పెళ్లి చేసుకుంటే నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఆధ్యా కాలేజీకి వెళ్లి తన కాళ్ళ మీద తాను నిలబడి స్థాయికి వచ్చినప్పుడు, నేను ఖచ్చితంగా రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఎవరి బెదిరింపులకు నేను భయపడాల్సిన అవసరం లేదు” అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు గట్టిగా ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది రేణూ దేశాయ్.
రేణూ దేశాయ్ కి మద్దతుగా నెటిజన్స్..
ఇక మొత్తానికైతే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆలోచనను అభిమానులతో పంచుకోవడంతో చాలామంది అభిమానులు రేణూ దేశాయ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. సింగిల్ పేరెంట్ గా ఇద్దరు పిల్లల బాధ్యతలు తీసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడిన వెంటనే మీరు మీ వ్యక్తిగతంగా ఆలోచించండి.. మీకంటూ ఒక తోడును వెతుక్కోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Akkada Ammayi Ikkada Abbayi: మార్కెట్‌లో ప్రదీప్ వాల్యూ రూ.2 కోట్లేనా..? ఇలా అయితే కష్టమే సామి..!