BigTV English

Renu Desai : ఎన్నాళ్లకు మళ్లీ అలా చూడబోతున్నాం.. ఫ్యాన్స్ కోరుకొనేది అదే..

Renu Desai : ఎన్నాళ్లకు మళ్లీ అలా చూడబోతున్నాం.. ఫ్యాన్స్ కోరుకొనేది అదే..

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో మెప్పించిన ఈమె ఇప్పుడు సినిమాలకు దూరంగా తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆమధ్య ఓ సినిమాలో అలా కనిపించింది. తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఇక విడిపోయారన్న పేరే కానీ పవన్‌ – రేణూ కలిసే ఉన్నారా అన్నంతగా వారి భావాలు ఉంటాయి.. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూనే ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఒక గుడ్ న్యూస్ పంచుకుంది.. ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


రేణు దేశాయ్ సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తుంది. సోషల్ సర్వీస్‌తో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ ఉంటారు రేణు దేశాయ్. గతేడాది తన ఎన్జీవో సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో తన సామాజిక కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. మూగ జీవాలను కాపాడటం కోసం రేణు దేశాయ్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. పలువురి ద్వారా ఆమె ఆర్థిక సాయం పొంది మూగజీవాలను కాపాడడం చేస్తుంది. తనకు తోచిన సాయం చేయడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ విరాళాలను అభ్యర్ధిస్తుంటారు రేణూ దేశాయ్.. ఇది ఈమధ్య ఏపీ ప్రభుత్వం కూడా ఆమెకు సాయంగా నిలిచిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

ఈమెకు సమాజసేవతో పాటుగా దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే పండుగలు, విశిష్ట పర్వదినాలలో ఖచ్చితంగా ఇంట్లో పూజలు చేయాల్సిందే. వీలు కుదిరినప్పుడల్లా ప్రముఖ ఆలయాలకు వెళ్లి దేవుడి సేవలో తరిస్తుంటారు. తను ఒక్కటే వెళ్లకుండా పిల్లలు అకీరా నందన్, ఆద్యలను కూడా తీసుకెళ్తూ పిల్లలకు అధ్యాత్మిక సేవల గురించి వివరించి మంచి మర్యాదలు కూడా నేర్పిస్తుంది.. ఇటీవలే రేణూ తన పిల్లలతో కలిసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను పెళ్లాడిన తర్వాత తన సినీ జీవితానికి గుడ్ బై చెప్పిన రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. ఈమధ్య రేణు దేశాయ్ ఓ సినిమా చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దాని గురించి ఆమెను సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది. సినిమాలోకి రావడం గురించి ఎన్ని సార్లు అడిగినా కూడా ఆమె దాటవేస్తే వచ్చింది ఇప్పుడైతే మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏదో షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా హింట్ ఇచ్చారు. బ్రేక్ టైమ్‌లో స్నాక్స్ తినడంతో పాటు కేరవాన్ ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాము తో రేణు దేశాయ్ సినిమాలు చేస్తుందని ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే అసలు విషయాలు తెలియని ఉన్నాయి..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×