BigTV English

Viral Video: లక్కీ అంటే నీదే గురూ.. రైలు నేరుగా వచ్చి ఢీకొట్టినా..

Viral Video: లక్కీ అంటే నీదే గురూ.. రైలు నేరుగా వచ్చి ఢీకొట్టినా..

అప్పుడప్పుడు కొన్ని వీడియోలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అదృష్టం ఇలా ఉంటుందా? అని అనిపిస్తుంది. ఇలాంటి ఆశ్చర్యకర వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తున్నది. ఓ కారు రైల్వే గేటు దగ్గర ఆగింది. ఎదురుగా ఓ పెద్ద కంటేనర్ వచ్చింది. ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. ఈ వీడియో చూసి అదృష్టం అంటే ఈ కారు డ్రైవర్ దే అంటున్నారు నెటిజన్లు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే.. ఓ రైల్వేట్రాక్ దగ్గర ఎలాంటి రైల్వే గేటు లేదు. రైలు వస్తుందా? లేదా? అని చూసుకుని వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. తాజాగా ఓ కారు రైల్వే గేటు దగ్గరికి వచ్చి ఆగింది. దూరం నుంచి అప్పటికే రైలు వస్తుండటం గమనించి ముందు జాగ్రత్తగా కారును ఆపాడు. రైల్వే గేటు లేకపోవడంతో ఓ పెద్ద ట్రక్క పట్టాలు దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. టక్కు పట్టాలు దాటే క్రమంలో రైలు వచ్చి ఢికొట్టింది. ఇంజిన్ ముందుకు రాగా, ట్రక్కు వెనుక భాగంలో బలంగా డ్యాష్ ఇచ్చింది. రైలు వేగానికి ట్రక్కు పూర్తి ఓ వైపు తిరిగిపోయింది. కారు ముందు నుంచి పక్కకు దూసుకెళ్లింది. కానీ, కారుకు ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. కొంచెం దూరంతో ట్రక్కు పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.ఈ ఘటన్ ట్రక్కు డ్రైవర్ సేఫ్ గా బయటపడ్డారు.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Pro Capital (@pro_capitalmotivation07)

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. నెటిజన్లు ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. కొంత మంది సీరియస్ గా కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘కచ్చింతగా ఈ కారు డ్రైవర్ కు అదృష్టం నడినెత్తిన ఉంది. లేకుంటే, అంత ప్రమాదం జరిగితే, కారుకు చిన్న గీత కూడా పడకపోవడం ఏంటి?” అంటున్నారు. “నేను చూసిన అత్యంత అదృష్టమైన వ్యక్తులలో ఈ కారు డ్రైవర్ నెంబర్ వన్” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “రైల్వే గేట్ లేకపోతే మాత్రం.. రైలు వస్తున్న విషయం కనిపించదా? రెండు నిమిషాలు ఆగితే కలిగే ఇబ్బంది ఏంటి?” అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. “ప్రాణం విలువ చాలా గొప్పది అనే విషయం మర్చిపోకూడదు. అదృష్టం బాగుండి ట్రక్కు డ్రైవర్ కూడా బతికిపోయాడు” అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “రైల్వే గేట్ల దగ్గర గేమ్స్ ఆడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ఏకంగా 3.5 మిలియన్ వ్యూస్ సాధించింది. లక్షకు పైగా లైక్స్ అందుకుంది.

Read Also: లోకో పైలెట్ నుంచి టీటీఈ వరకు.. పూర్తి మహిళా సిబ్బందితో పరుగులు తీసిన ఎక్స్ ప్రెస్ రైలు!

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×