Renu Desai: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న రేణూ దేశాయ్ (Renu Desai) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే అకీరా నందన్ (Akhira nandan) కు జన్మనిచ్చిన ఈ జంట, పెళ్లి తర్వాత ఆద్య (Adhya) అనే అమ్మాయికి జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన కొన్ని సంవత్సరాలకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకో పెళ్లి చేసుకోగా.. రేణూ దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటుంది.
ఎన్జీవో ప్రారంభించబోతున్న రేణూదేశాయ్..
అంతేకాదు జంతువులకు సహాయం చేస్తూ వుండే ఈమె.. ఇటీవలే ఒక ఎన్జీవోని కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలిపింది. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసే రేణూ దేశాయ్ ఈ మధ్యకాలంలో సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు జంతువుల పోషణకు డబ్బులు అవసరమైతే సోషల్ మీడియా ద్వారా అభిమానులను కూడా అడుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అందరిలో అవేర్నెస్ నింపుతూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తాజాగా సెలైన్స్ ఎక్కుతున్న వీడియోని షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
సెలైన్ ఫోటోతో సంచలనం రేపిన రేణూదేశాయ్..
సెలైన్ ఎక్కుతున్న వీడియోని షేర్ చేస్తూ..”ఆధునిక ఔషధం భౌతిక శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది” అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది. అయితే ఈ సెలైన్ ఎవరు ఎక్కించుకుంటున్నారు? అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అసలు రేణు దేశాయ్ కు ఏమైంది.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
రేణూదేశాయ్ కెరియర్..
డిసెంబర్ 4 1981 లో పూణె మహారాష్ట్రలో జన్మించింది రేణూ దేశాయ్. మోడల్ గా కెరియర్ ఆరంభించి ,ఆ తర్వాత నటిగా , కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘జేమ్స్ పాండు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అదే ఏడాది పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘బద్రి’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్త సన్నిహితంగా మారి, ప్రేమకు బీజం పోసింది. తర్వాత సహజీవనం మొదలైంది. అలా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ జంట సహజీవనం చేస్తూనే ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">