BigTV English

Anil Ravipudi : మెగాస్టార్ మూవీకి అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ డబుల్… ఎన్ని కోట్లంటే?

Anil Ravipudi : మెగాస్టార్ మూవీకి అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ డబుల్… ఎన్ని కోట్లంటే?

Anil Ravipudi : సక్సెస్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). దర్శకుడుగా పదేళ్ల కాలంలో ఆయన 8 బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చారు. ఇక రీసెంట్ గా ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) అనే మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.


అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ డబుల్

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi)తో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ రాబోతుందనే విషయంపై అనిల్ రావిపూడి సైతం అఫీషియల్ గా స్పందించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిరంజీవి మూవీ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ ప్రాజెక్టును షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత సాహు గారపాటి నిర్మించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని పెంచారు.


మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు ఆయన 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కొట్టిన హిట్టును దృష్టిలో పెట్టుకుని ఆయన డిమాండ్ చేసిన రేంజ్ లో పారితోషికాన్ని చెల్లించడానికి నిర్మాత సాహు గారపాటి కూడా అంగీకరించారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. 2026 సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ససక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి రెమ్యూనరేషన్

అనిల్ రావిపూడి రూపొందించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్ హీరోగా నటించారు. అయితే ఈ మూవీలో వెంకటేష్ కంటే ఎక్కువగా అనిల్ రావిపూడి పారితోషికం అందుకున్నారని టాక్ నడుస్తోంది. వెంకటేష్ 10 కోట్లు తీసుకుంటే, డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకున్నారని అంటున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్స్

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా స్ట్రాంగ్ పొంగల్ కానుకగా రిలీజై భారీ కలెక్షన్లను రాబట్టింది. మొదటి పది రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల షేర్ ని క్రాస్ చేసింది. ఇక 13 రోజుల్లో 276 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇలాగే ఈ జోరు కంటిన్యూ అయితే ఈ మూవీ 300 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అదే జరిగితే ఈ మూవీ 150 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రంగంలోకి దిగిన ఈ మూవీతో నిర్మాత దిల్ రాజు 100 కోట్లకు పైగా లాభాలను దక్కించుకున్నట్టు సమాచారం.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×