BigTV English

Police Dog: డ్యూటీ టైమ్‌లో అలా చేసింది.. పాపం, ఆ పోలీస్ డాగ్‌కు బోనస్ కట్!

Police Dog:  డ్యూటీ టైమ్‌లో అలా చేసింది.. పాపం, ఆ పోలీస్ డాగ్‌కు బోనస్ కట్!

China Corgi Police Dog: ప్రపంచంలోని అత్యంత విశ్వాసమైన జంతువులలో కుక్క తొలి స్థానంలో ఉంటుంది. తనను పెంచుకునే వారి కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు వెనుకాడదు. అందుకే, సూపర్ యాక్టివ్ డాగ్స్ సేవలను పోలీసు శాఖతో పాటు, ఆర్మీలోనూ ఉపయోగించుకుంటారు. చిన్నప్పటి నుంచే వారికి చక్కటి శిక్షణ ఇచ్చి, విధుల్లోకి తీసుకుంటారు. ఆ జాగిలాలు తమ చాకచక్యంతో ఎన్నో కఠినమైన సవాళ్లను ఈజీగా సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అయితే, ఎంత క్రమశిక్షణతో పెంచినప్పటికీ, కొన్నిసార్లు అవి తప్పులు చేస్తుంటాయి. అలా ఓ తప్పు చేసినందుకే మంచి పేరు సంపాదించుకున్న ఓ పోలీసు డాగ్ కు బోనన్ కట్ చేశారు అధికారులు. ఇంతకీ ఆ జాగిలం ఏం చేసిందంటే..


చైనా పోలీస్ శాఖలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫుజాయ్

చైనాలోని పోలీస్ శాఖలో పుజాయ్ అనే జాగిలానికి మంచి గుర్తింపు ఉంది. కోర్గీ జాతికి చెందిన ఈ పొట్టికాళ్ల కుక్క చిన్నప్పుడే పోలీస్ శాఖలోకి అడుగు పెట్టింది. అంతేకాదు, పోలీసు విభాగంలో చేరిన తొలి కోర్గీ జాతి డాగ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2023లో పుట్టిన ఈ జాగిలానికి ట్రైనర్లు మంచి శిక్షణ ఇచ్చారు. అన్నింటిలో బాగా ఆరితేరడంతో పోలీసు విభాగంలోకి తీసుకున్నారు. ఈ జాగిలం పోలీసులకు ఎంతో కీలకమైన క్లూస్ ఇచ్చేది. పేలుడు పదార్థాలను గుర్తించి పోలీసులను అలర్ట్ చేసేది. ఈ డాగ్ చూస్తుండగానే చైనాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వీఫాంగ్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ఈ డాగ్ పేరుతో ఓ సోషల్ మీడియా అకౌంట్ ను కూడా ఓపెన్ చేసింది. ప్రస్తుతం ఈ డాగ్ కు 50 వేలకుపైగా మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఈ డాగ్ పాల్గొనే ఆపరేషన్స్ కు సంబంధించి ఫోటోలు తీసి ఈ అకౌంట్ లో షేర్ చేస్తుంటారు. అలా ఈ డాగ్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.


విధుల్లో అలసత్వం, బోనస్ కట్

తన చురుకుదనంతో ఫుజాయ్ డాగ్ పోలీసులు శాఖలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో ముఖ్యమైన ఆపరేషన్స్ లో పాల్గొని ఉన్నతాధికారుల మన్ననలు పొందించింది. అయితే, గత కొద్ది రోజులుగా ఈ డాగ్ క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విధుల్లో అలసత్వం వహించడం మొదలుపెట్టింది. తాజాగా డ్యూటీలో ఉండగానే నిద్రపోయినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, తను ఫుడ్ తినే గిన్నెలోనే మూత్రం పోసిందట. ఈ డాగ్ డిస్సిప్లేన్ రోజు రోజు మరింత దిగజారిపోతుందని అధికారులు భావించారు.దాని వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఈ జాగిలానికి చెల్లించాల్సిన బోనస్ ను కట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంత మంచి డాగ్ ఎందుకు ఇలా మారిందా? అని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఈ డాగ్ ప్రవర్తనలో మార్పుకు కారణం ఏంటా? అని అధికారులు కూడా ఆరా తీస్తున్నారు.

Read Also: రన్ వే మీదున్న విమానంపై పిడుగు.. ఒక్కసారిగా అందరూ షాక్!

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×