BigTV English

Revathi Family : కనిపించని రేవతి ఫ్యామిలీ.. భయపెట్టారా ? తప్పించారా..? 

Revathi Family : కనిపించని రేవతి ఫ్యామిలీ.. భయపెట్టారా ? తప్పించారా..? 

Revathi Family : అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ రోజు రోజుకు కాసుల వర్షం కురిపిస్తుంది. నెల అవుతున్నా సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. నార్త్ లో ఇక చెప్పానక్కర్లేదు. వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. సినిమా సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ ప్రీమీయర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన కీలకంగా మారుతుంది. ఈ ఘటన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. దాంతో ఈ ఘటన రోజు రోజుకు కీలకంగా మారింది. మృతురాలి కుటుంబ సభ్యులు సంధ్య థియేటర్ పైన, అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది.. తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన న్యూస్ చక్కర్లు కొడుతుంది. రేవతి ఫ్యామిలీ సడన్గా కనిపించకుండా పోయిందనే వార్త సోషల్ మీడియాలో చర్చిని అంశంగా మారింది. ఇంతకీ రేవతి ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారా? లేక ఎక్కడికైనా వెళ్లారా? అన్నది ఆసక్తిగా మారింది.


రేవతి మరణం తర్వాత ఏం జరిగింది..? 

డిసెంబర్ 4 న పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు విడిచింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో 25 రోజులుగా చికిత్స పొందుతూన్నాడు.. అయితే ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.. సంధ్య థియేటర్ ఘటన రోజు జరగడానికి అసలు కారకుడు ఎవరని పోలీసులు ఆకోణంలో విచారణ చేస్తున్నారు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పోలీసులు vs అల్లు అర్జున్ లాగా మారింది. మొన్న అల్లు అర్జున్ ను రెండో సారి పోలీసులు విచారించారు. ఆ తర్వాత తెలంగాణ సీఏం తో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు అంతా అయిపోయిందని అనుకొనేలోపు మళ్లీ కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే రేవతి ఫ్యామిలీ మిస్సింగ్.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


రేవతి ఫ్యామిలీ ఎక్కడా..? 

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక్కో వెర్షన్ ఒక్కో రోజు బయటికి వస్తుంది. కానీ మొత్తంగా మాత్రం అల్లు అర్జున్‌నే ఒకింత ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టుగా ఉందంటూ సినీ జనాలు చెవులు కోరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అనేది చాలా పెద్ద విషయంగా మారిపోయింది.. ఆ తర్వాత ఆయన విడుదలైన కేసు పూర్తి అవ్వలేదని ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే తెలుస్తుంది.. ఇప్పుడు మరో కొత్త న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది. రేవతి ఫ్యామిలీ సడెన్ గా కనిపించకుండా పోయిందని. అసలు రేవతి ఫ్యామిలీ ఎక్కడికి పోయారన్నది హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని కొత్త పేటలో రేవతి ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు.. రేవతి చనిపోయిన తర్వాత రేవతి భర్త భాస్కర్, పాప, తల్లి మాత్రమే అక్కడ ఉండేవారు. శ్రీతేజ్ హాస్పిటల్ చికిత్స పొందుతూన్నాడు.. బాబును చూసుకోనేందుకు వీలుగా ఉండాలని ప్రభుత్వం నిమ్స్ హాస్పిటల్ కు దగ్గరలో ఒక రూమ్ ను ఇచ్చారు.

అయితే ఇప్పుడు కొత్త పేటలో భాస్కర్ కుటుంబ సభ్యులు లేరనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అక్కడ ఉండే స్థానికులు కూడా ఈ విషయం పై ఏమి చెప్పలేక పోతున్నారని టాక్. అయితే రేవతి ఈ కేసులకు, గొడవల వల్ల భయపడ్డారా? లేక భయపెట్టారా? ఈ ఫ్యామిలీ ఇప్పుడెక్కడ ఉంది? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. దీనిపై క్లారిటీ రావాలంటే రేవతి భర్త మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అలాగే తెలుగు నిర్మాత దిల్ రాజు రేవతి భర్తకు ఇండస్ట్రీలో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక శ్రీతేజ్ ను సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. బాబు ఆరోగ్యం కోలుకోవాలని విరాళాలు ఇస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×