Tollywood Movies:ప్రస్తుతం తెలుగు చిత్రాల కథ, కథనం తీరే మారిపోయింది. ఒకప్పుడు జనాలకు మెసేజ్ ఇచ్చే కథతో సినిమాలు వచ్చేవి. ఈ సినిమాలు చూసి చాలా మంది తమ క్యారెక్టర్ ను కూడా మార్చుకునేవారు. అయితే ప్రస్తుత కాలంలో కూడా చాలా సినిమాలు జనాలపై ప్రభావం చూపుతున్నాయి కానీ ఆ ప్రభావం అనేది చెడు వైపుకు దారి తీసేలా ఉంటోంది.అలా చాలా సినిమాలు జనాలను సక్రమమైన మార్గంలో నడిపేలా ఉండడం లేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా సినిమా కథలను పెంచుకుంటూ హిట్లు అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అంతేకాకుండా ప్రతి సినిమాలో ఏదో ఒక సెంటిమెంట్ సీన్ ను పెడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా వరకు జాతర సీన్స్ ను ప్రతి సినిమాలో ఏదో ఒక పాట రూపంలో కానీ లేదంటే చివరి సమయంలో కానీ పెడుతూ అద్భుతమైన హిట్లు అందుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో జాతర సీన్స్ వల్ల హిట్ అయిన సినిమాల లిస్టు పై ఓ లుక్కేద్దాం..
పుష్ప ది రూల్ :
‘పుష్ప 2’సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులనే కాకుండా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. అలాంటి ఈ చిత్రం ఇంతటి హిట్ సాధించడానికి కారణం జాతర ఎపిసోడ్ అని చాలామంది అనుకుంటున్నారు. ఈ సీన్ కోసం దర్శకుడు సుకుమార్ (Sukumar ) చాలా కష్టపడ్డారట. ఇందులో అల్లు అర్జున్(Allu Arjun) ని సరికొత్త గెటప్ లో చూపించి, ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు. ఈ సీన్ పెట్టడం వల్ల సినిమాకు చాలా ప్లస్ అయిందని, దీనివల్లే అది అద్భుతమైన విజయం సాధించిందని అంటున్నారు.
దేవర:
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR ) నటించిన ‘దేవర’ చిత్రంలో కూడా జాతర ఎపిసోడ్ హైలైట్ అయిన విషయం అందరికీ తెలుసు. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva)దర్శకత్వం అందించారు. ఇందులో జాతర సీన్ ని పెట్టి ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నారు. ఈ జాతర ఎపిసోడ్ వల్లే సినిమా సూపర్ హిట్ అయిందని చాలామంది అభిమానులు అంటారు.
క:
కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) హీరోగా నటించిన చిత్రం ‘క’, ఈ సినిమాకి సుజీత్, సందీప్ లు డైరెక్టర్లుగా చేశారు. ఈ సినిమాలో కూడా జాతర ఎపిసోడ్ చాలా కీలకంగా నిలిచింది. ఇందులో “ఆడు ఆడు ఆడు అమ్మోరే మురిసేలా ఆడు” అనే సాంగ్ చిత్రానికే హైలైట్ అని చెప్పవచ్చు. దీనివల్ల సినిమా సూపర్ హిట్ అయిందని ప్రేక్షకులు అంటున్నారు.
కమిటీ కుర్రోళ్ళు:
కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ సరోజ్, ఈశ్వర్ రచిరాజు, పెండ్యాల యశ్వంత్ కలిసి నటించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా చూసి ఎంతోమంది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీలో కూడా జాతర సీన్ ఉంటుంది. ఈ జాతర ఎపిసోడ్ వల్లే సినిమా సూపర్ హిట్ అయిందని సినిమా చూసిన చాలామంది అన్నారు.
కళింగ:
ధ్రువ వాయు (Dhruva Vayu)నటించి, స్వయంగా దర్శకత్వం వహించినటువంటి ‘కళింగ’ చిత్రంలో కూడా జాతర సాంగ్ హైలెట్ గా నిలిచింది.
ఈ విధంగా జాతర ఎపిసోడ్ తో వచ్చినటువంటి చాలా సినిమాలు అద్భుతమైన హిట్లు సాధించడంతో 2025 లో వచ్చే సినిమాల్లో కూడా జాతర సీన్స్ వచ్చేలా డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటున్నారట. ఏదేమైనా జాతర సీన్ తో 2024 లో చాలా సినిమాలు అద్భుతమైన హిట్లు సాధించాయని చెప్పవచ్చు.