RGV Niece Marriage : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఒక టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఊహించని పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఫిలిం మేకర్ గా ఒకప్పుడు టాప్ పొజిషన్ లో నిలిచిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు తరచూ వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే వర్మ ఎప్పుడూ కూడా ఫ్యామిలీకి దూరంగానే ఉంటారు. ఆయన ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఎవరూ లేరు. అయితే ఆ మధ్య వర్మ ఇంట పెళ్లి జరగడంతో ఆయన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మళ్లీ పెళ్లి కారణంగా వార్తల్లో నిలిచారు వర్మ. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ఆయన హాజరుకాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ (Sravya Varma) వివాహం భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) తో జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ గా సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో పలువురికి సుపరిచితురాలైన శ్రావ్య వర్మ.. ఇప్పుడు వివాహం చేసుకోవడంతో ఈ వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యంగా యాంకర్ సుమా (Suma ) కూడా ఈ పెళ్లి వేడుకలలో అందరిని అలరించింది. ఇక ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ ఎంతోమందికి మంచి అవుట్ ఫిట్ ఇస్తూ.. తెర వెనకే ఉంది కానీ తెర ముందుకి రాలేదు కానీ ఈమెతో సెలబ్రిటీలకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆ అనుబంధంతోనే శ్రావ్య వివాహానికి ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని సమాచారం.
ఇకపోతే శ్రీకాంత్ విషయానికొస్తే.. 2018లో బ్యాడ్మింటన్గా వరల్డ్ నెంబర్ -1 ర్యాంక్ సాధించిన ఈయన ఇప్పుడు వివాహం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ గా సుదీర్ఘకాలంగా టాప్ పొజిషన్లో కొనసాగుతున్న శ్రీకాంత్ వివాహానికి అటు క్రీడారంగం నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే మేన కోడలు పెళ్లికి వర్మ వచ్చారా లేదా అనే విషయం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.మరి వర్మ హాజరైన విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే రాంగోపాల్ వర్మ కి ఒక మేనకోడలు ఉందని.. ఆమె ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది అనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా యాంకర్ సుమా తో పాటు ఎంతో మందికి పర్సనల్ స్టైలిస్ట్ కూడా శ్రావ్య వర్మ పనిచేసింది. పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా , స్టైలిస్ట్ గా వ్యవహరించిన శ్రావ్య ఇప్పుడు వివాహం బంధం లోకి అడుగుపెట్టడంతో అందరికీ పరిచయం అయిపోయింది. ఇకపోతే మునుముందు అయినా ఈమెకు సినిమాలలో అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక ఇంటి వారైన శ్రావ్య వర్మ, కిదాంబి శ్రీకాంత్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే శ్రావ్య వర్మ పెళ్లిలో మహానటి కీర్తి సురేష్ (Keerthi Suresh) డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi paidipally ), రష్మిక మందన్న (Rashmika mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonada), ఆనంద్ దేవరకొండ (Anand Devarakonada) తోపాటు వారి తల్లిదండ్రులు అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.