BigTV English

Diy Coffee Face Mask: మీ ముఖం అందంగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

Diy Coffee Face Mask: మీ ముఖం అందంగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

Diy Coffee Face Mask: కాఫీ మిమ్మల్ని ఉదయాన్నే మేల్కొలపడానికి ఒక మార్గం మాత్రమే కాదు, ఇది మీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్, ఇతర పోషకాలు మీ చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో కూడా కాఫీ బాగా సహాయపడుతుంది.


కాఫీ పౌడర్‌తో  ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకుని వాడవచ్చు. ఇవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతే కాకుండా ముఖంపై మచ్చలు లేకుండా చేస్తాయి. చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడే కాఫీ పౌడర్‌తో ఫేస్ మాస్క్ లను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికి కాఫీ పౌడర్ ఫేస్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు:


ఎక్స్‌ఫోలియేషన్: కాఫీ పౌడర్ సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.అంతే కాకుండా మీ చర్మం మెరిసేలా చేస్తుంది.

రక్త ప్రసరణ: కాఫీ పౌడర్‌లో ఉండే కెఫిన్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది చర్మంలోని ఆక్సిజన్ , పోషకాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు: కాఫీ పౌడర్‌లో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

వాపును తగ్గిస్తుంది: కెఫీన్ వాసోకాన్‌స్ట్రిక్టివ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

సెల్యులైట్‌ను తగ్గించడం: కాఫీ సెల్యులైట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

స్కిన్ టోన్‌ను సమం చేస్తుంది: కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ టోన్‌ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

కాఫీ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి ?

కాఫీ ఫేస్ మాస్క్ చేయడానికి, మీరు మీ స్నిన్ టోన్ ప్రకారం వివిధ రకాల పదార్థాలను వాడవచ్చు.

కాఫీ పౌడర్, తేనె: ఒక చెంచా కాఫీ పౌడర్‌ని 1 స్పూన్ తేనెతో కలపండి.ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా వేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ మాస్క్ చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది.

కాఫీ పౌడర్, పెరుగు: ఒక చెంచా కాఫీ పౌడర్‌ని రెండు చెంచాల పెరుగుతో కలపండి. ఈ మాస్క్ చర్మాన్ని టోన్ చేస్తుంది. అంతే కాకుండా మెరిసేలా చేస్తుంది.

కాఫీ పౌడర్, కొబ్బరి నూనె: ఒక టీస్పూన్ కొబ్బరి నూనెతో ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ కలపండి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా ముఖానికి అప్లై చేయండి. 15- 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ మాస్క్ తరుచుగా ఉపయోగించడం వల్ల ముఖం అందంగా మారుతుంది.

కాఫీ, అలోవెరా జెల్ : ఒక చెంచా కాఫీ పౌడర్‌ను రెండు చెంచాల అలోవెరా జెల్‌లో వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

కాఫీ ఫేస్ మాస్క్ ముఖానికి ఎలా అప్లై చేయాలి ?

1. ముందుగా శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి.

2.కాఫీ ఫేస్ మాస్క్‌ని ముఖంపై సమానంగా అప్లై చేయండి.

3. 15-20 నిమిషాలు వదిలివేయండి.

4.చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

5. తరువాత మాయిశ్చరైజర్ ముఖానికి అప్లై చేయండి.

Also Read: పండగలు, ఫంక్షన్ల సమయంలో ఇలా చేస్తే ..నేచురల్‌గానే మెరిసిపోతారు తెలుసా ?

ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి:
కళ్ల చుట్టూ కాఫీ ఫేస్ మాస్క్ అప్లై చేయకండి.

మీ చర్మం సున్నితంగా ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×