BigTV English

RGV: దేవుడు ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసా.. విమాన ప్రమాదంపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

RGV: దేవుడు ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసా.. విమాన ప్రమాదంపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేనున్నాను అంటూ వర్మ వెంటనే వచ్చేస్తూ ఉంటాడు. దీనివలన ఎలాంటి విమర్శలు వచ్చినా.. ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు అంటున్నాడే కానీ, వివాదాలను మాత్రం వదలడం లేదు. ఒకప్పుడు వర్మ సినిమాలు అంటే ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్స్ అని చెప్పుకునే వారు. ఇప్పుడు వర్మ సినిమాలు అంటే అసలు అవి సినిమాలా అని విమర్శిస్తున్నారు. అయినా కూడా ఇవేమీ వర్మ పట్టించుకునే స్థితిలో లేడు.


 

ఈ మధ్యకాలంలో వర్మ దర్శకత్వం నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వర్మ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే పెద్ద పెద్ద సంఘటనలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటాడు .తాజాగా నిన్న జరిగిన విమాన ప్రమాదంపై వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గుజరాత్ లో అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన విమానం కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయినా విమానం కొద్ది క్షణాల్లోనే పక్కనే ఉన్న బీజే వైద్య కళాశాల హాస్టల్ పైన పడడంతో అక్కడ మంటలు అంటుకున్నాయి. హాస్టల్ మొత్తం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో  24 మంది విద్యార్థులు మృత్యువాత పడగా మరికొందరికి గాయాలు అయ్యాయి.


 

దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు తప్ప మిగిలిన వారందరూ కూడా మృత్యువాత పడ్డారు. ఆ ఒక్క ప్రయాణికుడు కూడా గాల్లో ఉండగానే బయటకు దూకడంతో ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇక ఈ మృతులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ  కూడా ఉన్నారు. భారతదేశంలో జరిగిన అత్యంత విమాన ప్రమాదాలలో ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదం కూడా ఒకటిగా చేర్చబడింది. ఇక ఈ విషయం తెలియడంతో సిని రాజకీయ ప్రముఖులు నిన్నటి నుంచి తమ సంతాపాలను తెలియజేస్తూ  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

తాజాగా వర్మ కూడా విమాన ప్రమాదంపై స్పందించాడు. అయితే ఎప్పటిలాగే తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దేవుడికి అన్నీ తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడా అని వర్మ ప్రశ్నించాడు. ఈమధ్య కాలంలో ఇండియాలో జరిగిన ప్రమాదాలను మొత్తం చెప్పుకొచ్చాడు. “దేవుడు ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసా?. మీరు సెలవుల కోసం అందమైన ప్రదేశానికి వెళ్తున్నారు..  అక్కడ ఉగ్రవాదులు మిమ్మల్ని  కాలుస్తున్నారు. మీరు ట్రోఫీ పరేడ్ లో  వేడుకలు జరుపుకోవడానికి వెళ్తున్నారు. తొక్కిసలాటలో చస్తున్నారు. మీరు విమానంలోఎగురుతున్నారు. విమానం కూలిపోతుంది. హాస్టల్ లో మీరు తింటున్నారు. విమానం మీపై పడుతుంది” అంటూ రాసుకొచ్చాడు.  ఇవన్నీ జరగడానికి దేవుడే కారణమని వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన కొందరు రాసి పెట్టి ఉంటే ఎక్కడైనా చనిపోతారు అని అంటుంటే.. ఇంకొందరు దేవుడు పని కాదు.. మనుషులు చేసే తప్పులు వలనే ఇది జరిగిందని చెప్పుకొస్తున్నారు. 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×