Fatima Sana Shaikh: దంగల్(Dangal) సినిమా.. అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పటి వరకు హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి సినిమాగా దంగల్ సినిమాకి పేరుంది. ఇప్పటివరకు దంగల్ సినిమా కలెక్షన్స్ ని బీట్ చేసిన సినిమా మరోటి లేదు.అయితే అలాంటి దంగల్ సినిమాలో నటించిన అమీర్ ఖాన్ కాకుండా ఆయన కూతురు పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత ఫాతిమా సనా షేక్ కి బాలీవుడ్లో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే అలాంటి ఫాతిమా దంగల్ కంటే ముందే తెలుగులో ఓ సినిమా చేసింది. ఆ సినిమా సమయంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. దీంతో సౌత్ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడినందుకు చాలామంది సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాతిమా సనా షేక్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు కూడా పెట్టారు.
క్యాస్టింగ్ కౌచ్ మాటలపై స్పందించిన ఫాతిమా..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaik) తన మాటలపై క్లారిటీ ఇచ్చింది. ఫాతిమా మాట్లాడుతూ.. “నేను దక్షిణాది ఇండస్ట్రీ మొత్తాన్ని కించపరచినట్టు మాట్లాడలేదు. దక్షిణాది ఇండస్ట్రీని అవమానించడం నా ఉద్దేశం కాదు. అలాగే క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీ మొత్తం ఉంటుందని నేను అనలేదు. కేవలం నేను సినిమా చేసిన టైంలో నాకు ఎదురైన చేదు అనుభవమే చెప్పాను. నేను మాట్లాడిన మాటలపై అనవసర రాద్ధాంతం చేశారు. అయితే మహిళా నటీమణులకు ఇలాంటి చేదు అనుభవాలు ప్రతి ఇండస్ట్రీలో ఎదురౌతాయి. నేను దక్షిణాదిలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్థాయి ఏజెంట్ లేకపోతే ప్రొడ్యూసర్ అవ్వచ్చు. ఆయన నన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. అందుకే ఆయన గురించి నేను దక్షిణాది ఇండస్ట్రీ అని మాట్లాడాల్సి వచ్చింది. కానీ దక్షిణాది ఇండస్ట్రీ మొత్తాన్ని అయితే నేను కించపరచలేదు. నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు” అంటూ ఫాతిమా క్లారిటీ ఇచ్చింది.
also read: Big TV Kissik Talks: నా లిప్ కిస్ చాలా కాస్ట్లీ.. భానుశ్రీ ఓపెన్ కామెంట్స్!
క్యాస్టింగ్ కౌచ్ పై ఫాతిమా షాకింగ్ కామెంట్స్…
అయితే గతంలో ఫాతిమా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను దక్షిణాదిలో ఓ సినిమాలో వర్క్ చేస్తున్నప్పుడు ఓ క్యాస్టింగ్ ఏజెంట్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. సినిమా కోసం దేనికైనా సిద్ధమేనా అంటూ ద్వంద్వర్ధాలు వచ్చేలా మాట్లాడారు. అయితే ఆయన మాటల్లో ఉన్న మీనింగ్ మొదట్లో నాకు తెలియదు.ఆ తర్వాత ఆయన పదే పదే అలా మాట్లాడేసరికి నాకు ఆయన మాటల వెనుక ఉన్న మీనింగ్ అర్థమైంది. అలాగే హైదరాబాదులో ఉండే కొంతమంది ప్రొడ్యూసర్లు హీరోయిన్లతో ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయాన్ని బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. అంటూ ఫాతిమా చెప్పుకొచ్చింది.ఇక ఫాతిమా మాట్లాడిన ఈ మాటలపై అప్పట్లో దక్షిణాది అభిమానులు ఫైర్ అయ్యారు. దాంతో తాజాగా క్లారిటీ ఇచ్చింది. తెలుగులో ఫాతిమా సనా షేక్ నువ్వు నేను ఒకటవుదాం (Nuvvu Nenu Okatavudam) అనే సినిమాలో నటించింది.