RGV: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో విచారణకు అల్లు అర్జున్ ను హాజరుపరచగా 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తరువాత వెంటనే బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలుకు వెళ్లకుండానే బన్నీ బయటకు వచ్చేశాడు.
ఇక అల్లు అర్జున్ ను అన్యాయంగా అరెస్ట్ చేసారని సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బన్నీకి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే నాని, రష్మిక, శ్రీ విష్ణు, అనిల్ రావిపూడి లాంటివారు ట్వీట్స్ చేశారు. ఇక తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన రీతిలో ఈ అరెస్ట్ ను ఖండించాడు. మొదటి నుంచి వర్మ.. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఉంటూనే వస్తున్నాడు.
మెగా- అల్లు కుటుంబాల మధ్య వివాదం వచ్చినప్పుడు కూడా బన్నీకి సపోర్ట్ గా నిలబడ్డాడు. చిరంజీవి కన్నా అల్లు అర్జున్ గొప్ప నటుడు అని.. పుష్ప 2 గురించి నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వస్తున్నాడు. తాజాగా బన్నీ అరెస్ట్ పై స్పందిస్తూ.. నాలుగు ప్రశ్నలు సంధించాడు. అధికారులను సమాధానాలు చెప్పమని కోరాడు.
” అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు. 1. పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ? 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? 3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ? 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ?” అంటూ రాసుకొచ్చాడు.
నిజం చెప్పాలంటే వర్మ అడిగిన దాంట్లో తప్పు లేదు. కానీ, ఇక్కడ బన్నీ.. పోలీసులు రావద్దు అన్నా కూడా వచ్చాడు. సాధారణంగా బెన్ ఫిట్ షోస్ కు సంధ్యా థియేటర్ లాంటి మాస్ థియేటర్ కు వెళ్లడం నిజంగా బన్నీ చేసిన పొరపాటే. ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారని తెలిసి, తొక్కిసలాట జరుగుతుందేమో అని ముందే అనుకోని జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. థియేటర్ యాజమాన్యం కూడా బన్నీని రావద్దు అని చెప్పినట్లు తెలిపింది.
Miss You Movie Review : ‘మిస్ యూ’ మూవీ రివ్యూ
పైన వర్మ చెప్పిన పాయింట్స్ గురించి మాట్లాడాలంటే.. వాటన్నింటికి ముందే పోలీసుల వద్దాం పర్మిషన్స్ తీసుకుంటారు. వాళ్ళు బందోబస్త్ చేసినా ఇలాంటి ప్రాణ నష్టం జరిగితే అది అది వేరే విషయం. ఆ సమయంలో పోలీసులు వద్దు అన్నప్పుడు బన్నీ ఆగి ఉంటే.. ఒకవేళ బన్నీ వస్తున్నదని పోలీసులు బందోబస్త్ ఇచ్చి ఉంటే ఇలాంటిది జరిగేది కాదేమో అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా.. అంటే ఏంటి వర్మ.. అల్లు అర్జున్ దేవుడని అంటున్నావా..? అని కొందరు.. తప్పు ఎవరిది అయినా.. బాధ్యత హీరో మీదనే ఉంటుందిలే అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
. @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు .
1.
పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
2.
ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?
3.
ప్రీ రిలీజ్…
— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024