Meghana Sankarappa: ఈమధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు కొత్త తోడును వెతుక్కుంటున్నారు.. అందులో భాగంగానే తమకు నచ్చిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకుంటూ కొత్త ఆనందాలకు దగ్గరవుతున్నారు. ఇంకొంతమంది పెళ్ళీడు వచ్చినా.. వివాహానికి దూరమవుతున్నారు. మరికొంతమంది ఆరుపదుల వయసుకి చేరువైనా సరే పెళ్లి అంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు.. అయితే ఇంకొంతమంది మాత్రం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని.. అన్ని ముచ్చట్లు తీర్చుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తాము ప్రేమించిన వారిని తమ భాగస్వామిని చేసుకుంటూ పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెడుతుంటే.. మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన వివాహాన్ని చేసుకుంటూ కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య (Naga Chaitanya) గత ఏడాది శోభిత (Shobhita) ను కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోగా.. ఇప్పుడు ఒక బుల్లితెర హీరోయిన్ కూడా తన ప్రియుడిని వివాహం చేసుకుంది.
మూడు ముళ్ళు ఏడడుగులతో కొత్త బంధంలోకి అడుగుపెట్టిన మేఘనా శంకరప్ప..
ఆమె ఎవరో కాదు మేఘనా శంకరప్ప (Meghana Shankarappa). నమ్మదే యువరాణి, కిన్నెరి వంటి సీరియల్స్ లో కనిపించి.. తన అందంతోనే కాదు నటనతో కూడా మెప్పించిన ఈమె, ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన రియాల్టీ డాన్స్ షోలో కూడా పాల్గొని జడ్జిలు అందర్నీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీతారామ (Sitarama) అనే సీరియల్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తన ప్రియుడు జయంత్ (Jayanth)తో ఏడడుగులు వేసినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. కాగా, వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 9వ తేదీన చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ అసలు విషయాన్ని తెలిపింది. అలాగే తన భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మేఘన శంకరప్ప భర్త ఎవరంటే..?
మేఘన శంకరప్ప భర్త పేరు జయంత్ (Jayanth).ఈయన బెంగళూరుకు చెందినవారు. అక్కడే ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మేఘనాతో పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే మేఘన శంకరప్ప ఒక ఇంటి వారయ్యారని చెప్పవచ్చు. ఈ నూతన జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్..
కన్నడ సీరియల్స్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న మేఘనా శంకరప్ప అటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే ఈమె.. ఇంస్టాగ్రామ్ లో కూడా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. మరి వివాహం తర్వాత కూడా నటన రంగంలో కొనసాగుతుందా లేక వ్యక్తిగత జీవితానికి పరిమితం అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">