Khushi Kapoor: ఈరోజుల్లో స్టార్ కిడ్స్ అంతా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కోసం యాక్టింగ్ స్కూల్ బాటపడుతున్నారు. అందరికీ తెలిసినా తెలియకపోయినా స్టార్ కిడ్స్ అంతా ప్రముఖ యాక్టింగ్ స్కూల్స్ నుండి ట్రైన్ అయ్యే బయటికి వస్తారు. అలా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సఫలం అవుతుంటారు. తాజాగా అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషి కపూర్ కూడా ఈ యాక్టింగ్ స్కూల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుపటి జెనరేషన్ యాక్టర్స్‌లో ఎవరూ యాక్టింగ్ స్కూల్స్‌కు వెళ్లలేదని, తన తల్లి శ్రీదేవి కూడా వెళ్లి ఉండదంటూ చెప్పుకొచ్చింది ఖుషి కపూర్. అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూలో తమ యాక్టింగ్ అనుభవాలు కూడా పంచుకున్నారు.
స్టార్ కిడ్స్ ప్రమోషన్స్
జునైద్ ఖాన్ (Junaid Khan), ఖుషి కపూర్ (Khushi Kapoor) హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రమే ‘లవ్‌యాపా’ (Loveyapa). యూత్‌ఫుల్ సినిమా కావడంతో, పైగా హీరోహీరోయిన్లు ఇద్దరూ స్టార్ల వారసులు కావడంతో ఈ మూవీపై బాలీవుడ్‌లో మంచి బజే క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. అయినా కూడా జునైద్, ఖుషి కలిసి ఇంకా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉన్నారు. అలా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తమ యాక్టింగ్ ట్రైనింగ్ గురించి బయటపెట్టారు ఈ ఇద్దరు స్టార్ కిడ్స్. ముందుగా థియేటర్ ఆర్టిస్ట్‌గా ఒక ప్రముఖ స్కూల్‌లో జునైద్‌ను జాయిన్ చేశాడట అమీర్ ఖాన్. దానికోసం తను అసలు లెక్కలేనంత ఖర్చు కూడా పెట్టాడని జునైద్ తెలిపాడు.
ఆమె అలా చేయలేదు
సినిమా పరిశ్రమలో ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉంటామా లేదా అనేది ఎవరూ ఊహించలేని విషయమంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు జునైద్ ఖాన్. కానీ తల్లిదండ్రుల జెనరేషన్‌లో ఇలా ఫిల్మ్ స్కూల్‌కు వెళ్లడం లాంటివి ఉండేది కాదని, నేచురల్‌గా చేసేవాడని చెప్పాడు. ఖుషి కపూర్ కూడా జునైద్ మాటలను అంగీకరించింది. ‘‘నిజం చెప్పాలంటే మా అమ్మ ఏ యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లలేదు ఎందుకంటే తను 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే యాక్టింగ్ ప్రారంభించింది. మూడేళ్లకే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లడం కష్టం కాబట్టి తను వెళ్లి ఉండదు’’ అని బయటపెట్టింది. జునైద్ ఖాన్ కూడా తన తండ్రి సినీ ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకున్నాడు.
Also Read: నాకు ఇష్టం లేనివారితో పనిచేయను.. తేల్చిచెప్పిన సోనమ్ కపూర్
చాలా ఖర్చుపెట్టాను
‘‘మా నాన్న డిప్లోమా సినిమాలు చేసుకుంటూ చాలాకాలం ఎఫ్‌టీఐఐలోనే గడిపారు. అందుకే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లలేదు. కానీ ఈ పని గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే నేను థియేటర్ స్కూల్‌కు వెళ్లి మా నాన్న సంపాదించిన డబ్బును ఖర్చుపెట్టగలిగాను. అదే నాకు పెద్ద సౌకర్యం. ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్కలాగా విషయాలను గమనిస్తూ ఉంటారు. మనం నేర్చుకుంటూ ఉంటే మెల్లగా మెరుగుపడతాం. నేను, మా నాన్న ఈ విషయాల గురించి చాలా మాట్లాడుకుంటాం’’ అని చెప్పుకొచ్చాడు జునైద్ ఖాన్. ఇక జునైద్ ఖాన్, ఖుషి కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లవ్‌యాపా’ మూవీ ఫిబ్రవరి 7న విడుదలయ్యి పాజిటివ్ టాక్ లభించింది.