Rhea Chakraborty: రియా చక్రవర్తి (Rhea Chakraborty) బాలీవుడ్ బ్యూటీగా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తన సినిమాల కంటే కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh Rajput) గర్ల్ ఫ్రెండ్ గానే భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే అతి తక్కువ సమయంలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించడంతో ఆ కేస్ ఈమె మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంలో ఈమె పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు పోలీసులు కూడా ఈమెను అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఇకపోతే సుశాంత్ మరణం తర్వాత ఆమెతో పాటు ఆమె తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు అయింది. దీంతో ఇద్దరి కెరీర్లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా తమ జీవితాలు నాశనమయ్యాయి అంటూ రియా చక్రవర్తి తాజాగా ఎమోషనల్ అవుతూ పలు కామెంట్లు చేసింది.
సుశాంత్ మరణం.. మా జీవితాలను నాశనం చేసింది – రియా
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రియా చక్రవర్తి మాట్లాడుతూ.. “సుశాంత్ సింగ్ మరణం తర్వాత మా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. మేము ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము.. ఇక ఆ ఒక్క సంఘటనతో మా జీవితం మొత్తం ముగిసిపోయింది అనిపించింది. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్లు రాలేదు. అలాగే నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96% తో పాస్ అయ్యాడు. కానీ అదే సమయంలో నాతోపాటు నా తమ్ముడు కూడా అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు కూడా మిస్ అయ్యాడు. దీంతో అతడి ఎంబీఏ కెరియర్ భవిష్యత్తును కూడా కోల్పోవాల్సి వచ్చింది.
ఇక ఏదైనా కార్పొరేట్ లో ఉద్యోగం పొందుదాము అంటే ఈ విషయం అతడి కెరీర్ కు మరింత నష్టాన్ని కలిగించింది. ఇక తమ్ముడికి ఉద్యోగం లభించడం కూడా కష్టంగా మారింది. నిజానికి నా తమ్ముడిని నియమించుకోవడానికి ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. దాంతో కొద్ది రోజులు మా జీవితాలు ఎటువైపు వెళుతున్నాయో అర్థం కాలేదు. ఇక మాకు ఎవరూ అవకాశం ఇవ్వకపోయేసరికి మేమే బిజినెస్ మొదలు పెడదామనుకున్నాం. అలా “ఛాప్టర్ 2 డ్రిప్” అనే దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. దాన్నే కెరియర్గా ఎంచుకున్నాము” అంటూ తమ బాధలను చెప్పుకొచ్చింది రియా చక్రవర్తి. ఇక సుశాంత్ మరణం తర్వాత వీరు ఎదుర్కొన్న కష్టాలు.. పడ్డ ఇబ్బందుల గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సుశాంత్ కేసు నుండి క్లీన్ చిట్..
ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం లో వీళ్ళిద్దరూ కీలకంగా ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. పైగా జైలు జీవితం కూడా అనుభవించారు..కానీ కోర్టులో విచారణ తర్వాత అటు రియా చక్రవర్తి తో పాటు ఆమె తమ్ముడు షోయిక్ లకి ఎటువంటి సంబంధం లేదని, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక దీంతో ఆమె మళ్ళీ నటన రంగంలోకి అడుగు పెట్టింది రియా. ఇటీవల ‘రోడీస్’ లో కనిపించిన ఈమె తన సొంత పాడు కాస్ట్ ను కూడా ప్రారంభించింది. ఇందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఏది ఏమైనా రియా చక్రవర్తి తన జీవితంలో ఒక చెడు అధ్యాయాన్ని ఎదుర్కొంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
also read:Subhasree Rayaguru: కోస్టార్ట్స్ ఇలా పార్ట్నర్స్ అయ్యాం.. తొలిప్రేమపై బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ!