BigTV English
Advertisement

Rhea Singha: 19 ఏళ్ల అమ్మాయి, 51 మందితో పోటీ.. చివరికి మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటం, ఇంతకీ తనెవరు?

Rhea Singha: 19 ఏళ్ల అమ్మాయి, 51 మందితో పోటీ.. చివరికి మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటం, ఇంతకీ తనెవరు?

Miss Universe India Rhea Singha: ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్‌లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల రియా సింఘా.. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన పేరే వినిపిస్తోంది. అసలు రియా సింఘా ఎవరు, తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు సెర్చింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ 19 ఏళ్ల అమ్మాయి.. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొన్న 51 మందిని ఓడించింది. అంతే కాకుండా 2024లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా ఇండియా తరపున నిలబడడానికి సిద్ధపడింది. దీంతో రియా సింఘా ఎవరు అనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది.


చిన్నప్పటి నుండే ఆసక్తి

రియా సింఘా తండ్రి బ్రిజేష్ సింఘా.. ఒక బిజినెస్‌మ్యాన్. ఆయన ఒక ఆన్‌లైన్ స్టోర్ రన్ చేస్తున్నారు. అదే ‘ఈస్టోర్ ఫ్యాక్టరీ’. రియా తల్లి పేరు రీతా సింఘా. రియాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్, మోడలింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండేది. అలా మోడలింగ్‌లో అడుగుపెట్టి బ్యూటీ పోటీల్లో పాల్గొనడం వరకు వెళ్లింది. ప్రస్తుతం ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు చదువును మ్యానేజ్ చేసుకుంటోంది. కానీ తను ఏం చదువుతుంది అనే విషయం పూర్తిగా క్లారిటీ లేదు. ఇప్పటివరకు తను పలు బ్యూటీ పోటీల్లో పాల్గొన్నా కూడా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలవడం అనేది తన కెరీర్‌ను మరో మలుపు తిప్పనుంది. పైగా దీని వల్ల తను మిస్ యూనివర్స్ పోటీలకు కూడా ప్రమోట్ అయ్యింది.


Also Read: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సెప్టెంబర్ 22న మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీలు జరిగాయి. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలిచి మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా తరపున సెలక్ట్ అవ్వడంపై రియా సింఘా సంతోషం వ్యక్తం చేసింది. ఈ పోటీల్లో మొదటి రౌండ్ నుండే తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసింది రియా. ఊర్వశి రౌతెలా లాంటి జడ్జిలను చాలా ఇంప్రెస్ చేసేసింది. 19 ఏళ్లకే తను ఇలాంటి ఘనతను సాధించడం తనలాంటి ఎంతోమంది అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. మిస్ యూనివర్స్ కిరీటం భారత్‌కు చాలా అరుదుగా వచ్చింది. కానీ రియా కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి తను ఆ టైటిల్ దక్కించుకుంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అప్పట్లో ఊర్వశి

2024 మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఊర్వశి రౌతెలాతో పాటు నిఖిల్ ఆనంద్, వియాత్నాంకు చెందిన న్యూయెన్ క్యూన్హ్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రియాన్ ఫెర్నాండెజ్, బిజినెస్‌మ్యాన్ రాజీవ్ శ్రీవాస్తవ కూడా జడ్జిలుగా వ్యవహరించారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని ఊర్వశి రౌతెలా దక్కించుకుంది. ఇప్పుడు అదే కిరీటాన్ని తానే స్వయంగా రియా సింఘాకు అందజేసింది. త్వరలోనే మెక్సికోలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో రియా సింఘా ఇండియా తరపున పోటీపడడానికి సిద్ధమవుతోంది. గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని శ్వేతా శార్దా దక్కించుకొని మిస్ యూనివర్స్ పోటీలకు చేరుకోగా అక్కడ తన టాప్ 20 కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×