Sandalwood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ‘ఛలో’ సినిమా ద్వారా అడుగుపెట్టి, ‘గీతగోవిందం’తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా చేసి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇందులో రక్షిత్ శెట్టి(Rakshith Shetty) హీరోగా నటించగా, రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే రక్షిత్, రష్మిక ఇద్దరూ కూడా ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి, నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక కొద్ది రోజుల్లో పెళ్లి అనుకునే లోపే ఇద్దరూ అనూహ్యంగా విడిపోవడంతో పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది.
రష్మిక లేని పోస్టర్ షేర్ చేసిన రిషబ్..
ఆ తర్వాత తమ కెరియర్ లో ఎవరికి వారు బిజీ అయిపోయారు. రష్మిక టాలీవుడ్ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఇదిలా ఉండగా కిరికి పార్టీ సినిమా విడుదలై ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తుండడంతో ప్రముఖ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో.. “దాదాపు 8 సంవత్సరాల క్రితం హృదయాలను హత్తుకునే, లెక్కలేనన్ని జ్ఞాపకాలను సృష్టించే ప్రయాణం ప్రారంభం అయింది. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమకు , మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్షిత్ శెట్టి ఈ మరుపురాని ప్రయాణానికి కారణం” అంటూ రాసుకు వచ్చారు. అంతేకాదు ఇక్కడ రష్మిక మందన్న లేని పోస్టర్ ను షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇక పోస్ట్ అలా వైరల్ అయిందో లేదో ఇది చూసిన చాలామంది వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగాయని, అందుకే ఈ పోస్టర్ షేర్ చేశాడని పలు రకాలుగా నెటిజన్స్ సైతం చర్చించుకుంటున్నారు.
రష్మిక ను రక్షిత్ మర్చిపోయారా..
ఇకపోతే రక్షిత్ శెట్టి కూడా ఎక్స్ ద్వారా ఒక పోస్టు షేర్ చేశారు.” ఎనిమిది సంవత్సరాల క్రితం కిరిక్ పార్టీ నా ప్రయాణంలో, నా జట్టులో ఒక మలుపుగా మారింది. ఈ సినిమా మన హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది” అంటూ రాసుకు వచ్చాడు. రక్షిత్ కూడా రష్మిక గురించి ఎక్కడ పోస్ట్ పెట్టకపోవడంతో రిషబ్ తో గొడవలు నిజమేనని అందరూ అనుకుంటున్నారు. మరి వీరిద్దరి గొడవలకు గల కారణం ఏమిటి ?ఎక్కడ ఆ గొడవలు మొదలయ్యాయి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.
ఇద్దరికీ రష్మిక దూరమేనా..?
మరొకవైపు రష్మిక మందన్న కూడా ఒక స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇకపోతే రష్మిక కిరిక్ పార్టీ సినిమా మొదలుకొని పుష్ప 2 సినిమా వరకు మొత్తం 26 సినిమాలు చేసింది. ఇందుకు సంబంధించి రష్మిక అభిమానులు సోషల్ మీడియా ఖాతా ద్వారా.. 8 ఏళ్లు, 26 సినిమాలు, మొత్తం నాలుగు భాషలలో ఇండియా మోస్ట్ టాప్ యాక్ట్రెస్.. రష్మిక కు మేము అభిమానులు అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాము అంటూ ఆమె సినిమాలకు సంబంధించి ఒక వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోని రష్మిక షేర్ చేస్తూ.. ఓ మై గాడ్ 26 సినిమాలు అంటూ క్యాప్షన్ పెట్టింది. మొత్తానికి అయితే వీరి మధ్య గొడవలు ఎందుకు జరిగాయో తెలియదు గానీ వీరు చేసే పోస్ట్లు మాత్రం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.
ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ,
ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.
ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.8 years ago, a journey began that touched hearts and created countless memories.
Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024