BigTV English
Advertisement

Maname Teaser: అరరే.. ఈ బుడ్డోడు ఆ బుద్దోడిలానే ఉన్నాడే! అవును.. ఆ డైరెక్టర్ కొడుకే ‘మనమే’ సినిమాలో శర్వానంద్ కొడుకుగా..

Maname Teaser: అరరే.. ఈ బుడ్డోడు ఆ బుద్దోడిలానే ఉన్నాడే! అవును.. ఆ డైరెక్టర్ కొడుకే ‘మనమే’ సినిమాలో శర్వానంద్ కొడుకుగా..

Director Sriram Aditya Son Playing Sharwanand’s Sons Role in ‘Maname’ Movie: కుర్ర హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మనమే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ మొత్తం విదేశాల్లోనే చూపించారు.


మంచివాడు అని చెప్పుకొని తిరిగే హీరో.. మాట మీద నిలబడాలి అనుకొనే హీరోయిన్.. వీరిమధ్య అనుకోకుండా వచ్చిన ఒక చిన్న బాబు. అసలు ఆ బుడ్డోడు ఎవరు.. ? ఈ కుర్ర జంట బాబుకు తల్లిదండ్రులుగా ఎందుకు మారారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక టీజర్ లో శర్వానంద్, కృతి కన్నా అందరి చూపు బాబుపైనే పడింది. ఎంతో ముద్దుగా లాంగ్ హెయిర్ తో ఉన్న ఈ బాబు ఎవరో కాదు.. ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ముద్దుల కొడుకు విక్రమ్ ఆదిత్య. ఏంటి.. నిజమా.. ? అంటే అవును.. విక్రమ్ బాలనటుడుగా తన తండ్రి సినిమాలోనే ఎంట్రీ ఇస్తున్నాడు.

Also Read: Nandamuri Balakrishna: తారకరత్న ఇంటికి కొడుకుతో పాటు వెళ్లిన బాలయ్య..


శ్రీరామ్ ఆదిత్య సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. భలే మంచిరోజు సినిమాతో తెలుగు తెరకు అడుగుపెట్టాడు. ఇక అతని భార్య ప్రియాంక గ్రేస్. వీరిద్దరిది ప్రేమ పెళ్లి.. 2020 లో ఈ జంటకు విక్రమ్ జన్మించాడు. ఇక మనమే కథకు బాబు పాత్ర ఎంతో ముఖ్యం. దీంతో తన కొడుకునే తీసుకుంటే బావుంటుందని శ్రీరామ్ అనుకోని విక్రమ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు. ఈ గడుసు పిల్లాడు ఎలాంటి బెరుకు లేకుండా తండ్రి చెప్పినట్లు విని నటించేశాడు. ప్రస్తుతం తండ్రీకొడుకుల ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×