Sourav Ganguly Daughter: భారత లీజెండరీ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ కూతురు సనా గంగూలి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. సన గంగూలి ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి కోల్కతాలోని డైమండ్ హార్బర్ లో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో సనా కారుకు డ్యామేజీ అయ్యింది.
Also Read: Pant Fifty: పగబట్టినట్లుగా పంత్ విధ్వంసం.. కష్టాల్లో భారత్!
ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఓప్రైవేట్ బస్సు కారుని వెనక నుండి ఢీ కొట్టిన సమయంలో.. కారును డ్రైవర్ నడుపుతున్నాడని.. సనా గంగూలి పక్క సీట్లో కూర్చొని ఉన్నారని తెలిపారు. బెహరా చౌరస్తాలో కారును ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్ళిపోయాడని తెలిపారు పోలీసులు. అయితే స్థానికుల సాయంతో, తన డ్రైవర్ తో కలిసి సనా బస్సుని వెంటాడి కొంత దూరం వెళ్లిన తర్వాత అడ్డగించిందని.. తమకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకొని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రమాదం పై సనా గంగూలి నుంచి అధికారికంగా ఫిర్యాదు రాలేదని పోలీసులు వివరించారు. గంగూలి – క్లాసికల్ డాన్సర్ డోనా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సౌరబ్ గంగూలీ – డోనా దంపతులకు ఏకైక సంతానం సనా. 2001లో జన్మించిన సనా చదువుతోపాటు తల్లివద్ద నృత్య శిక్షణ కూడా తీసుకుంది. ఈమె 12వ తరగతి వరకు కోల్కతాలో చదువుకుంది. అనంతరం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళింది.
యూకే లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి బీఎస్సీ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ పొందింది సనా. అయితే ఓ వైపు చదువుకుంటేనే హెచ్ఎస్బిసి, గోల్డ్ మన్ శాక్స్ వంటి బహుళ జాతి కంపెనీలతో ఇంటర్న్ షిప్ లకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్స్ కన్సల్టింగ్ కంపెనీ అయిన పీడబ్ల్యుసి లో ఇంటర్నెట్ షిప్ చేసింది. ఈ పిడబ్ల్యుసి లో పనిచేసే వారికి 30 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది.
ప్రస్తుతం 23 ఏళ్ల సనా అమెరికాలోని ఇనోవేరోవ్ లో కన్సల్టెంట్ గా ఉద్యోగం సంపాదించింది. ఇక సనా గంగూలి సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. 2019లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఆమె ఓ పోస్ట్ చేయగా ఓ పెద్ద దుమారం రేగింది. దీంతో ఆమె తన ఇన్స్టా అకౌంట్ ని క్లోజ్ చేసి.. కొత్తగా ప్రైవేట్ అకౌంట్ తెరిచింది.
Also Read: Jasprit Bumrah Injury: టీమిండియాకు షాక్.. బుమ్రాకు గాయం..ఆస్పత్రికి తరలింపు !
అప్పటినుండి సోషల్ మీడియాని చాలా తక్కువగా ఉపయోగిస్తుంది. ఆమె చిన్నతనంలో తన తండ్రి బాటలో నడిచి క్రికెటర్ కావాలని అనుకుంది. కానీ క్రికెట్ లో ఉన్న ఇబ్బందులను గంగూలీ తన కూతురికి చెబుతూ ఆ వైపు అడుగులు వేయద్దని సలహా ఇచ్చాడు. ఇక గంగూలీకి దాదాపు 700 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. భారత జట్టు తరుపున అతడు 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు.