BigTV English

Rithu Chowdary Husband : ల్యాండ్ స్కామ్ పై స్పందించన రీతూ భర్త.. నేను దేనికైనా సిద్ధమే..

Rithu Chowdary Husband : ల్యాండ్ స్కామ్ పై స్పందించన రీతూ భర్త.. నేను దేనికైనా సిద్ధమే..

Rithu Chowdary Husband : ఏపీలో ల్యాండ్ స్కామ్ సంచలనంగా మారింది. రూ. 700 కోట్ల స్థలాలను చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ధర్మ సింగ్ అనే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఒక లేఖను సీఎం చంద్రబాబుకు రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది రాజాకీయాల్లో కలకలం రేపుతుంది. అసలు ఆ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.? ఎలా రాయించారు.? ఆ ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా పేదల పొట్టలు కొట్టారా? ఇలాంటి ప్రశ్నలు ఏపీ ప్రజలకు వస్తున్నాయి. సింగ్ చెప్పిన విషయంతో పోలీసులు, ఏసీబి అధికారులు ఆయనను సీక్రెట్ ప్లేసులో ఉంచి విచారిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వివాదంలోకి జబర్దస్త్ నటి రీతూ చౌదరి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలు నిజా నిజాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ఎవరీ ధర్మా సింగ్..? 

ఈ ధర్మా సింగ్ అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్.. ఈయనపై గతంలో లంచాలు తీసుకుంటున్నాడనే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అనేక సార్లు జైలుకు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇక ఆయన పై ఏసీబి అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాంతో ధర్మా సింగ్ 13 నెలలుగా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గత ఏడాది ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఆస్తులను సీజ్ చేశారని తెలుస్తుంది. ఆ సోదాలతో పారిపోయినట్లు టాక్.. సింగ్ పై పలు కేసులు ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లారట.. తాజాగా గుంటూరులో పోలీసులకు ధర్మాసింగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.


బిగ్ టీవీతో మాట్లాడిన చీమకుర్తి శ్రీకాంత్..

ఏపీలో 700 కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. చీమకుర్తి శ్రీకాంత్, ఆయన భార్య రీతూ చౌదరి తో పాటు వీరి ముఠా ఉన్నట్లు ధర్మా సింగ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ గురించి తాజాగా చీమకుర్తి శ్రీకాంత్ బిగ్ టీవీ తో మాట్లాడారు.. అసలు నిజాలను బయటకు పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. “ధర్మా సింగ్ అనే వ్యక్తి ఒక ఫ్రాడ్.. రిజిస్టర్ గా ఉంటూనే అనేక సార్లు లంచాలు తీసుకున్నారని అన్నారు.. ఆయన నా పేరు మీద 700 కోట్ల భూములు ఉన్నట్లు చెప్పారు. నా పేరు మీద ఎక్కడ ఉన్నాయి? ఎవరు పెట్టారు చెప్పండి. ఒకవేళ మీరు ఉన్నాయని నిరూపిస్తే వాటిని ఎవరి పేరు మీద రాయమంటే వారి పేరు మీద రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సింగ్ లంచగొండి.. ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 3.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఎక్కడ నుంచి వచ్చాయి. అలాగే నన్ను జగన్ బినామీ అని భారతి బినామీ అని అన్నారు కదా.. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏసీబీకి కేసులు పెట్టారు.. ఆ కేసులు ఇప్పటికీ నామీద ఉన్నాయని అందరికీ తెలుసు కానీ నేనెలా జగన్ కి బినామీగా ఉంటాను. నేను నా భార్య దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. అసలు నిజా నిజాలు ఏంటో పోలీసులు, ఏసీబీ అధికారులు తెలుసుకోవాలి. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులతో పాటుగా అనేక వ్యాపారాలు చేసి కూడబెట్టుకున్న సొమ్మునే ఏసీబీ అధికారులు ఫ్రీజ్ చేశారు వాటినే ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు 700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నిరూపించాలి” అని  సవాల్ విసిరారు.. మరి దీనిపై ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.

రీతూ చౌదరి మౌనం.. 

జబర్దస్త్ నటి రీతు చౌదరి మీద ల్యాండ్ స్కామ్ ఆరోపణలు వినిపిస్తున్న కూడా ఆమె స్పందించలేదు.. రీతు చౌదరికి ఇంతవరకు పెళ్లి కాలేదని అందరూ అనుకున్నారు ఇప్పుడు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి దీనిపై కూడా రీతూ చౌదరి ఎలాంటి స్పందన లేదు. ఆమె రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×