BigTV English

Caste Census: కులగణన సర్వేలో సంచలన విషయాలు.. క్రెడిట్ రేవంత్ సర్కార్‌దే

Caste Census: కులగణన సర్వేలో సంచలన విషయాలు.. క్రెడిట్ రేవంత్ సర్కార్‌దే

Caste Census: బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది కాంగ్రెస్ నినాదం. దాని ప్రకారం అడుగులేస్తోంది. తన యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్‌గాంధీ పదేపదే ఈ విషయాన్ని నొక్కి వక్కానించారు. అంతేకాదు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన చేపట్టింది. గతేడాది నవంబర్‌లో రేవంత్ సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేపట్టింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


దేశ జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నినాదం. దీన్ని నెరవేర్చాలంటే కచ్చితంగా దేశవ్యాప్తంగా జనాభా గణనతోపాటు కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఎత్తుకున్న ఈ నినాదాన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలు అందిపుచ్చుకున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు కుల గణన సైతం చేశాయి. రిపోర్టు మాట కాసేపు పక్కనబెడదాం.

ఏడాది కిందట తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. గత నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. రాష్ట్ర జనాభాలో 55 శాతం బీసీలేనట. మరో 45 శాతం ఎస్టీ, ఎస్సీ, ఓసీ ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం రెడీ చేసిందని సమాచారం.


ఈ సర్వేను ఆపేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అన్ని అడ్డంకులు అధిగమించి సర్వే చేపట్టింది రేవంత్ సర్కార్. మొత్తం కోటి 17 లక్షల 47 వేల ఇళ్లకు స్టిక్కర్లు వేశారు. అందులో 98 శాతం వరకు వివరాలు సేకరించినట్టు వెల్లడించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన రిపోర్టును రేపో మాపో ప్రభుత్వం వెల్లడించనుంది.

ALSO READ:  కన్ఫ్యూజన్‌లో కేడర్‌.. కేసీఆర్ శకం ముగిసినట్టేనా? కాకపోతే

సీఎం రేవంత్ అధ్యక్షతన శనివారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో కులగణన సర్వే నివేదికపై చర్చించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఇవాళ జరగనున్న కేబినెట్‌లో మొత్తం 18 అంశాలు అజెండాలో ఉన్నట్లు సమాచారం. అందులో కులగణన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రాజకీయ పార్టీల విషయానికొద్దాం. రేపో మాపో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వెలువడునున్న నేపథ్యంలో పార్టీలు యాక్టివ్ అయ్యాయి. వారం రోజులుగా బీసీల మంత్రాన్ని జపిస్తున్నాయి పార్టీలు. ఓ అడుగు ముందుకేసిన బీఆర్ఎస్.. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ తెరపైకి తెచ్చింది.

గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందంటూ అధికార పార్టీతోపాటు మేధావుల నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. గతంలో ఉన్న రిజర్వేషన్లు తగ్గించిన ఘనత బీఆర్ఎస్‌‌కే చెల్లుతుందని కుండబద్దలు కొడుతున్నాయి.

ఇక బీజేపీకి దగ్గరకు వద్దాం. బీసీని ప్రధానిమంత్రి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందం టూ ఆ పార్టీ నేతలు మీడియా ముందు ఒకటే రీసౌండ్. అలాంటప్పుడు కుల గణన చేయడానికి ఎందుకు వెనుకాడుతోందని విపక్షాల నుంచి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. అయినా కులగణనపై ప్రధాని మీన మేషాలు లెక్కిస్తున్నారు. మొత్తానికి కులగణన అంశం ప్రధానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×