IND vs Aus 5th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 2025 టోర్నమెంట్ లో ( Border Gavaskar Trophy 2024 – 2025 Tournament ) భాగంగా ప్రస్తుతం…. టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదవ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా పట్టు బిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 185 పరుగులకు అలౌట్ అయింది. అయితే ఈ స్కోరు చాలా తక్కువ అని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం ఆ స్కోర్ పెద్దదిగా కనిపించింది. మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు 51 ఓవర్లు ఆడి.. ఆల్ అవుట్ అయింది.
Also Read: Jasprit Bumrah Injury: టీమిండియాకు షాక్.. బుమ్రాకు గాయం..ఆస్పత్రికి తరలింపు !
51 ఓవర్లలో.. 181 పరుగులు చేసి ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా టీం. దీంతో… టీమిండియా కంటే నాలుగు పరుగులు వెనుకబడే ఉండిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీం ఇండియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో… కంగారు కంగారెత్తిపోయారు. ప్రతి మ్యాచ్ లో 300, 400 కుట్టిన ఆస్ట్రేలియా టీం… ఈ ఐదవ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం 181 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఐదవ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా పై చేయి సాధించింది.
టీమిండియా బౌలర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే గాయం కారణంగా ఈ మ్యాచ్ మధ్య నుంచి ఆసుపత్రికి వెళ్ళాడు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) . అయినప్పటికీ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ( Prasidh Krishna ), ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి 7 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ప్రసిద్ధి కృష్ణ 15 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు.
Also Read: Rohit sharma Retirement: నేను పిచ్చోన్నికాదు…రిటైర్మెంట్ పై రోహిత్ సంచలన ప్రకటన !
ఇలా టీమ్ ఇండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో…. టీమిండియా… పై చేయి సాధించగలిగింది. ఇక ఆటో ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేదు. ఓపెనర్ గా వచ్చిన సామ్ కాన్స్టాస్ 23 పరుగులకే అవుట్ అయ్యాడు. ఉస్మాన్ కవాజా రెండు పరుగులు చేసి నిన్న అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మర్నస్ రెండు పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక స్టీఫెన్ స్మిత్ 33 పరుగులతో పరవాలేదనిపించాడు.
ఇక ఆస్ట్రేలియా డేంజర్ బ్యాట్స్మెన్ హెడ్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. గత నాలుగు టెస్టుల్లో దుమ్ము లేపే బ్యాటింగ్ చేసిన హెడ్… ఈ టెస్ట్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగో పరుగులు చేసి సిరాజుకు దొరికిపోయాడు. ఇక కొత్తగా వచ్చిన వెబ్ స్టార్ మాత్రం 57 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అలాగే అలెక్స్ క్యారీ 21 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక టేలండర్స్ ఈసారి విఫలమయ్యారు. కాగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) ఆస్పత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే.