RK Roja : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో నటి రోజా(Roja) ఒకరు. హీరోయిన్ గా తెలుగు తమిళ భాష చిత్రాలలో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రోజా సినిమా అవకాశాలు కాస్త తగ్గడంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఈమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నగరి నియోజకవర్గ నుంచి పోటీ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలలో రోజా ఓటమిపాలు కావడంతో ఈమె తిరిగి ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.
డ్రామా జూనియర్స్…
రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ వచ్చారు. ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్(Jabardasth) కామెడీ షో కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించేవారు. ఈ కార్యక్రమాల ద్వారా ఈమె కమెడియన్లతోపాటు పంచులు వేస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసేవారు. ఇక ఈమెకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమం నుంచి కూడా తప్పుకొని రాజకీయాల పరంగా బిజీ అయ్యారు. పాలు కావడంతో ప్రస్తుతం పలు బుల్లి తెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
యాంకర్ గా మారిన రోజా..
జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ (Drama Juniors)కార్యక్రమానికి రోజా జడ్జిగా (Judge)వ్యవహరిస్తున్నారు. ఇక ఈమెతో పాటు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో భాగంగా యాంకర్ గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer)పై రోజా కాస్త సీరియస్ అయ్యారు. రోజా మాట్లాడటం కోసం గొంతు సరి చేసుకుంటూ ఉండగా వెంటనే సుధీర్ ఏంటి మేడం గొంతు సరి చేసుకుంటున్నారు అంటూ అడగడంతో రోజు నేను జడ్జిగా చేస్తున్నాను కదా ఫ్యాన్స్ అందరూ యాంకర్ గా చేయమని అడుగుతున్నారంటూ రోజా మాట్లాడుతారు.
?utm_source=ig_web_copy_link
రోజా ఇలా మాట్లాడటంతో వెంటనే సుధీర్ అమ్మో ఈవీడేంటీ నా పోస్ట్ కి ఎసరు పెట్టేలాగ ఉన్నారు. హాయ్ హలో నమస్తే అంటూ రోజా యాంకరింగ్ ప్రారంభం చేయగా వెంటనే సుధీర్ మేడం మీరు యాంకర్ గా చేసిన నేను కో యాంకర్ గా ఉంటానని చెప్పటంతో రోజా ఓకే అంటుంది అయితే రోజా కన్నా గట్టిగా సుదీర్ మాట్లాడటంతో వెంటనే రోజా.. హలో ఏంటి నన్ను డామినేట్ చేస్తున్నావ్, వెనక్కి వెళ్ళు అంటూ సరదాగా సీరియస్ అయ్యారు. రోజా ఇలా మాట్లాడటంతో పక్కనే ఉన్న అనిల్ రావిపూడిని ఉద్దేశిస్తూ చూడండి సార్ అంతా మీ వల్లే అని మాట్లాడారు. వెంటనే అనిల్ రావిపూడి నేనేం చేశానయ్యా అంటూ ప్రశ్నించడంతో.. మీరు నాకొక సినిమా ఛాన్స్ ఇచ్చి ఉంటే నేను ఇక్కడ ఉండే వాడిని కాదు, మీ వల్లే అందరితో మాటలు పడాల్సి వస్తుంది అంటూ సుధీర్ మాట్లాడటంతో వెంటనే అనిల్ రావిపూడి నీకు సినిమా ఛాన్స్ ఇచ్చి ఉంటే నేను మాటలు పడాల్సి వచ్చేది అంటూ తనదైన శైలిలోనే సుదీర్ కు పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.