Harish Shankar : హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా హరీష్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక సినిమా గబ్బర్ సింగ్. వరుసగా పది సంవత్సరాలు పాటు ఫ్లాప్ సినిమాలు పడుతున్న టైంలో గబ్బర్ సింగ్ సినిమాతో అద్భుతమైన సక్సెస్ పవన్ కళ్యాణ్ కెరియర్ కి అందించాడు హరీష్ శంకర్. ఒక నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలి అనుకుంటాడో అలా చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా విడుదలైనప్పుడు ఒక సంచలనం గా మారింది. చాలామంది సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ స్టామినాని మరొకసారి తమ మాటల్లో గుర్తు చేశారు. మళ్లీ హరీష్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
స్పీచ్ తోనే నమ్మకం కలిగించాడు
షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హరీష్ మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన మిరపకాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కి ముందు ఆడియో లాంచ్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు లాగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా శాశ్వతం అని అప్పుడు ఒక మంచి ఎలివేషన్ తన మాటల్లో అందించాడు. ముఖ్యంగా ఆ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు చేసిన ప్రామిస్ ను చాలా సక్సెస్ఫుల్ గా ఆ సినిమాతో నిలబెట్టుకున్నాడు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వస్తుంది అంటే అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది.
హరీష్ శంకర్ కు వరుస డేట్లు
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సినిమా కోసం 45 రోజులు డేట్ కేటాయించారు. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు. ఇక రీసెంట్ గానే ఓజికి సంబంధించి షూటింగ్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 26న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అలానే పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
Also Read : Tollywood Producer : మెగా కంపౌండ్ వార్నింగ్… భయపడిపోయి రాజీనామా లేఖ ఇచ్చేసిన నిర్మాత