BigTV English

Phone Tapping Case : ప్రభాకర్‌రావు పథకం ప్రకారమే లొంగిపోయారా?

Phone Tapping Case : ప్రభాకర్‌రావు పథకం ప్రకారమే లొంగిపోయారా?

Phone Tapping Case : బిగ్ ఫిష్ చిక్కింది. ఇక ఫోట్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చినట్టే అనుకున్నారు. కానీ, అసలే ఆయన మాజీ ఎస్‌ఐబీ చీఫ్. అంత ఈజీగా అసలు నిజాలు చెప్పేస్తారా? విచారణలో అదే జరుగుతోందని తెలుస్తోంది. పోలీసులు అడిగే ప్రశ్నలకు ప్రభాకర్‌రావు చాకచక్యంగా సమాధానాలు చెబుతున్నారని సమాచారం.


ప్రభాకర్ రావు ఆన్సర్స్ ఇవే..

వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. అయితే, సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభాకర్‌రావు సరైన సమాధానం చెప్పట్లేదని తెలుస్తోంది. కోర్టులో వినిపించిన వాదనలనే.. సిట్ ముందు చెప్పారట. తాను ఎస్ఐబీలో పని చేసినప్పటికీ.. తనపైన ఇంకా అధికారులు ఉన్నారని.. పై అధికారులకు తాను చేసిన ప్రతీ పని తెలుసునని.. వారి నిరంతర పర్యవేక్షణలోనే తాను వర్క్ చేశానని చెప్పారట. ఉన్నతాధికారులకు తెలీకుండా తాను ఏ పని కూడా చేయలేదని అన్నారట. ఇక, ఎస్ఐబీ కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్ డిస్క్‌లకు సంబంధించి ప్రభాకర్ రావు ఎలాంటి సమాచారం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారని అంటున్నారు.


అమెరికాలో కౌన్సిలింగ్ ఇచ్చారా?

మరోవైపు, ప్రభాకర్ రావు విచారణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయన మామూలోడు కాదు.. మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. పథకం ప్రకారమే ప్రభాకర్‌రావు లొంగిపోయి విచారణకు హాజరయ్యారని ఆరోపించారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు.. కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని ఆ తర్వాతే ఆయన లొంగిపోయారని అన్నారు.

బండి డిమాండ్స్ ఇవే..

విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు? ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు? అనేది బయటకు రావాలన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని.. ప్రభాకర్ రావుతో సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనన్నారు బండి సంజయ్.

మరోవైపు ప్రభాకర్‌రావును సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ కొన్ని క్వశ్చన్స్ లీక్ అయ్యాయి. అవేంటంటే..

1. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చెప్పాలనుకుంటున్నారు ?

2. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు ?

3. కేసు నమోదు అయిందనే సమాచారంతోనే విదేశాలకు పారీపోయారా?

4. మీరు రాజీనామా చేసిన రోజు హార్డ్ డిస్క్‌లను ఎందుకు ధ్వసం చేశారు?

5. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు.. మా దగ్గర స్టేట్మెంట్ ఉంది మీరేమంటారు?

6. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్‌ను ఎవరు చెపితే ఏర్పాటు చేశారు?

7. ఆ టీమ్‌ను గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఏర్పాటు చేశారా?

8. 4 వేలకు పైగా ఫోన్‌లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.. ఆ నెంబర్లు ఎవరు ఇచ్చారు?

9. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులందరూ మీ పేరే చెప్తున్నారు.. ఎందుకు?

10. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారు.. ఇందులో కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కదా?

11. సాధారణ ఎన్నికల్లో BRS పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్‌లను, ఇతర ఆధారాలను ధ్వసం చేయాలని ముందే ప్లాన్ చేశారా?

12. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజు రిజైన్ చేసి, ఆధారాలను మాయం చేశారా?

13. శ్రవణ్ రావు ప్రయివేటు వ్యక్తి.. అతనితో SIBకి ఏంటి సంబంధం?

14. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను సైతం ఎందుకు ట్యాప్ చేశారు? మీకు ఎవరైనా పెద్దలు ఆదేశాలు ఇచ్చారా?

15. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో.. కేవలం విపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి.. టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా?

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×