BigTV English

Robinhood Release Date: క్రిస్మస్ రేసు నుండి తప్పుకున్న ‘రాబిన్‌హుడ్’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?

Robinhood Release Date: క్రిస్మస్ రేసు నుండి తప్పుకున్న ‘రాబిన్‌హుడ్’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?

Robinhood Release Date: ఏ పండగ అయినా కచ్చితంగా థియేటర్లలో సినిమా సందడి ఉండాల్సిందే. అందుకే ప్రతీ పండగకు సినిమాల మధ్య గట్టి పోటీ జరుగుతుంది. అలాగే క్రిస్మస్‌కు కూడా పలు సినిమాలు పోటీపడుతున్నాయని ముందుగానే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు క్రిస్మస్‌కు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే సరైన సినిమాలనే లేదు. నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ మూవీ డిసెంబర్ 25న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఆ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందని వార్తలు వచ్చినా కూడా దానిపై స్పందించలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ‘రాబిన్‌హుడ్’ టీమ్ స్పందించింది. మూవీ పోస్ట్‌పోన్ అయిన విషయంపై క్లారిటీ ఇచ్చింది.


మాట మార్చారు

నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబినేషన్‌లో ఇప్పటికే ‘భీష్మ’ అనే మూవీ వచ్చింది. చాలాకాలం తర్వాత ‘భీష్మ’తో తన హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నితిన్. అందుకే కొన్ని వరుస ఫ్లాపులు ఎదుర్కున్న తర్వాత మళ్లీ వెంకీ కుడుములకే అవకాశమిచ్చాడు ఈ యంగ్ హీరో. వీరిద్దరిలో కాంబినేషన్‌లో ‘రాబిన్‌హుడ్’ గురించి అనౌన్స్‌మెంట్ రాగానే కచ్చితంగా ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని యూత్ ఫిక్స్ అయిపోయారు. కానీ చాలాకాలం వరకు ఈ మూవీ నుండి సరైన అప్డేట్ లేదు. ‘రాబిన్‌హుడ్’ షూటింగ్ ప్రారంభం అయిన మొదట్లోనే కచ్చితంగా ఈ మూవీ క్రిస్మస్‌కు వస్తుందని మాటిచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు.


Also Read: “సంక్రాంతికి వస్తున్నాం” కి ఎవ్వరూ రావడం లేదు..పెద్ద సినిమాకు బిజినెస్ కష్టాలు..?

త్వరలోనే ప్రకటిస్తాం

నవంబర్ చివరి వారంలో ‘రాబిన్‌హుడ్’ మూవీ క్రిస్మస్‌కు విడుదల కావడం లేదని వార్తలు మొదలయ్యాయి. అయినా మేకర్స్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వకుండా డిసెంబర్ 25 రిలీజ్ డేట్ అంటూ పోస్టర్లు విడుదల చేశారు. ఇటీవల ఈ మూవీలో ఐటెమ్ సాంగ్ విడుదల చేస్తామని చెప్పి పోస్ట్‌పోన్ చేశారు. దీంతో ప్రేక్షకుల్లో అనుమానం మరింత పెరిగిపోయింది. మొత్తానికి ఇన్నాళ్ల కన్ఫ్యూజన్‌కు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ పోస్ట్‌పోన్ అని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘‘అనుకోని కారణాల వల్ల మేము ముందుగా ప్లాన్ చేసినట్టుగా డిసెంబర్ 25న రాబిన్‌హుడ్ రిలీజ్ అవ్వడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని ప్రకటన విడుదల చేశారు.

అప్పుడే రిలీజ్

‘‘మీ ఎగ్జైట్మెంట్‌ను అలాగే ఉండనివ్వండి. కచ్చితంగా మీ వెయిటింగ్‌కు తగిన ఎంటర్‌టైన్మెంట్‌తో వస్తాం. కచ్చితంగా ఈ ఎంటర్‌టైనర్ థియేటర్లలో మీకు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్ ఇస్తుంది’’ అంటూ ఫ్యాన్స్‌కు మాటిచ్చారు ‘రాబిన్‌హుడ్’ (Robinhood) మేకర్స్. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించకపోయినా.. వచ్చే ఏడాది శివరాత్రికి లేదా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘రాబిన్‌హుడ్’ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్‌మెంట్ మిగిలింది. ఈ మూవీలో నితిన్‌కు జోడీగా శ్రీలీల (Sreeeleela) నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×