Sankranthiki Vasthunnam : వచ్చే ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి పెద్ద హీరోల సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో రామ్ చరణ్ (Ram Charan), శంకర్(Shankar) దర్శకత్వంలో చేసే ‘గేమ్ ఛేంజర్’, బాబీ(Bobby)దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna) చేస్తున్న ‘డాకు మహారాజ్’ తోపాటు వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi)కాంబినేషన్లో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వచ్చే యేడాది సంక్రాంతి పండుగకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఈ స్టార్ హీరోలందరూ కూడా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బిజినెస్ కష్టాలు రావడం అందరూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని చెప్పవచ్చు.
వెంకటేష్ మూవీకి బిజినెస్ కష్టాలు..
ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే విడుదలకు ఇంకా 28 రోజులే మిగిలి ఉండగా ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేపట్టలేదు. దీనికి తోడు అటు శాటిలైట్ కానీ , ఇటు ఓటీటీ బిజినెస్ కానీ ఈ చిత్రానికి జరగలేదు. ముఖ్యంగా వెంకటేష్ లాంటి సీనియర్ హీరో, దీనికి తోడు బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా అంటే ఎప్పుడో ఈ సినిమాకి బిజినెస్ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి గల ప్రధాన కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. దీనికి తోడు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవానికి రెండు రోజుల క్రితం ఒక ప్రమోషనల్ వీడియో అయితే షూట్ చేశారు. కానీ సీనియర్ హీరో సినిమాకి ఉండాల్సిన రేంజ్ అయితే అది కాదు అనే కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలు..
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), ఐశ్వర్య(Aishwarya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య వెంకటేష్ భార్యగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనున్నారు. ముక్కోనపు క్రైమ్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ఉపేంద్ర లిమాయో, రాజేంద్రప్రసాద్, నరేష్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గెస్ట్ పాత్రలో యంగ్ హీరో..
ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా అందుతున్న విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని, ఈ పాత్రలో ఒక యంగ్ హీరో కనిపిస్తాడని సమాచారం. అంతే కాదు క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఒక కామెడీ సీక్వెన్స్ నడుస్తోందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాకు బిజినెస్ జరగకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.