BigTV English

Rocking Rakesh – Sujatha : పండండి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ సుజాత

Rocking Rakesh – Sujatha : పండండి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ సుజాత

Rocking Rakesh – Sujatha :ఓవైపు టాలీవుడ్ లో వరుసగా బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంటే, మరోవైపు గుడ్ న్యూస్ లు కూడా వస్తున్నాయి  బుల్లితెర సెలబ్రిటీ కపుల్ రాకింగ్ రాజేష్, జోర్దార్ సుజాత తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా తాము తల్లిదండ్రులమయ్యాము అంటూ రాకింగ్ రాకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు.


పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సుజాత

జోర్దార్ సుజాతగా పాపులర్ అయిన సుజాత అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ షో ద్వారా కంటెస్టెంట్ గా అడుగు పెట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేష్ ను పెళ్లాడింది. పెద్దల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత కూడా పలు స్మాల్ స్క్రీన్ షోలలో, సినిమాలలో కనిపించిన ఈ జంట రీసెంట్ గా తాము తల్లిదండ్రులము కాబోతున్నాం అన్న శుభవార్తను పంచుకున్నారు. అందులో భాగంగానే సుజాత శ్రీమంతం కూడా ఘనంగా జరిపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుజాత పండంటి పాపకు జన్మనిచ్చింది అంటూ రాకింగ్ రాకేష్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ అపురూపమైన క్షణాలు తన జీవితంలో అద్భుతం అంటూనే తన జీవిత భాగస్వామి అయిన సుజాత ఓ బిడ్డకు తల్లిగా ఆనందించే క్షణం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నాడు రాకేష్, ‘స్త్రీని గౌరవిద్దాం.. పూజిద్దాం’ అంటూ చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేష్. ఈ నేపథ్యంలోనే ఆమెకు సెలబ్రిటీల నుంచి మొదలుకొని అభిమానులు వరకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.


జోర్దార్ సుజాత సినీ ప్రయాణం

బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులలో మంచి పాపులారిటీని తెచ్చుకున్న జోర్దార్ సుజాత ఆ తర్వాత కొన్ని బుల్లితెర షోలలో కన్పించింది. అందులో ‘జబర్దస్త్’ కూడా ఒకటి. అప్పటికే ‘జబర్దస్త్’ అనే కామెడీ షోలో తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ టీం లీడర్ గా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ తో కలిసి సుజాత పలు ప్రోగ్రామ్స్ కూడా చేసింది. అలా బుల్లితెర వీరిద్దరి ప్రేమకు వేదిక అయింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని బుల్లితెర ద్వారా అభిమానులకు బహిరంగంగానే చెప్పేశారు. అనంతరం 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో గ్రాండ్ గా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా సుజాత సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా ‘సేవ్ ది టైగర్స్’ లో ఆమె ప్రియదర్శి సరసన నటించిన తీరుపై ప్రశంసల వర్షం కురిసింది. మొత్తానికి ఈ జంట తాజాగా మహాలక్ష్మి లాంటి పాపను తాజాగా ఇంటికి ఆహ్వానించారు. ఇక నిన్ననే టాలీవుడ్ హీరోయిన్ చైత్ర శుక్ల కూడా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని బయట పెట్టింది. సెప్టెంబర్ 30న ఈ బ్యూటీ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంతలోపే సుజాత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. .

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×