Indian student Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కోమాలో ఉన్న ఓ భారతీయ విద్యార్థిని కుటుంబానికి అమెరికా అత్యవసర వీసా అందించేందుకు అంగీకరించింది. భారత ప్రభుత్వ అధికారుల వినతిపై సానుకూలంగా స్పందించిన అమెరికా అధికారులు.. బాధితురాలికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. విదేశాంగ శాఖ అధికారుల ప్రత్యేక చొరవతో బాధితురాలి కుటుంబ సభ్యులకు పెండింగ్ లో ఉన్న వీసా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అమెరికా అధికారులు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 28న శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు స్లాట్ కేటాయించిన అమెరికా విదేశాంగ శాఖ.. వీసా ఇంటర్వ్యూకి అవకాశం కల్పించింది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మహారాష్ట్ర లోని సితార జిల్లాకు చెందిన నీలం షిండే అనే విద్యార్థిని అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ఉండే ప్రాంతంలోనే వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆమె క్లాస్ మేట్స్, స్థానిక పోలీసుల సాయంతో అక్కడే ఓ ఆసుపత్రిలో చేర్పించారు. నీలం షిండే తలకు బలమైన గాయాలైనట్లు గుర్తించిన వైద్యులు.. ఛాతీ, తలపై గట్టి దెబ్బలు తగిలిన్నట్లు గుర్తించారు. దీంతో.. అత్యవసర చికిత్స కోసం ఇండియాలోని తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకుని నీలం షిండే తలకు శస్త్ర చికిత్స చేశారు. అయినా.. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకోని బాధితురాలు.. కోమాలోకి వెళ్లింది.
నీలం షిండే ఫిబ్రవరి 12న ప్రమాదానికి గురి కాగా ఇండియాలోని తల్లిదండ్రులకు ఫిబ్రవరి 14న ఆమె స్నేహితులు సమాచారం అందించారు. దాంతో.. కుతుర్ని చూసుకునేందుకు భారత్ లోని బాధితురాలి తల్లిదండ్రులు ఫిబ్రవరి 16న వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ వీసా ఇంటర్వ్యూ ఇంకా పెండింగ్ లోనే ఉండటంతో.. వారు అమెరికా వెళ్ళటం వీలు కాలేదు. ఓ పక్క కూతురు కోమాలో మృత్యువుతో పోరాడుతుంటే.. మరి తల్లిదండ్రులు వీసా కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విషయం NCP (SP) ఎంపీ సుప్రియ సూలే దృష్టికి రావడంతో ఆమె ట్విట్టర్ ద్వారా బాధితురాలి కుటుంబ పరిస్థితి గురించి పోస్ట్ చేశారు. ఆమె తల్లిదండ్రులకు00 సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, భారత దేశంగా శాఖ మంత్రి జయ శంకర్ ను కోరారు. ఆమె తండ్రి వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఆమె తండ్రికి అత్యవసర వీసా మంజూరు చేసేలా సహాయం చేయాలని ఆమె కోరారు.
Also Read : UP News : 7 ఏళ్ల చిన్నారికి టీచర్ చెంప దెబ్బ – కంటి చూపు కోల్పోయిన బాలిక
సుప్రియ సులే సోషల్ మీడియా పోస్ట్ తో విషయం తెలుసుకున్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్.. వెను వెంటనే స్పందించారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులను, భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించారు. నీలం శిండే తండ్రికి, వారి కుటుంబ సభ్యులకు వెను వెంటనే అత్యవసర వీసా మంజూరు చేసేలా సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అగ్రరాజ్యాధికారులతో సంప్రదింపులు జరిగిన భారత ప్రభుత్వ అధికారులు సానుకూల ఫలితాలను సాధించారు.