Roja Selvamani: మినిస్టర్ కొండా సురేఖ.. అక్కినేని కుటుంబంపై చేసిన సంచలన వ్యాఖ్యలపై సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. మీడియా ముందుకువచ్చిన కొండా సురేఖ.. కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఇక ఇందులోకి సమంతను లాగారు. నాగచైతన్య- సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, N కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్, నాగార్జునను అడిగాడని, నాగార్జున కూడా సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళమని చెప్పాడని, అది ఒప్పుకోలేక సామ్ విడాకులు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనే పెను తుఫాన్ ను సృష్టించాయి.
నిజానిజాలు తెలుసుకోకుండా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం మాత్రమే కాకుండా రాజకీయ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున, సమంత, అమల, చిన్మయి.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పోస్టులు వేశారు. ఇంకోపక్క కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ గా నోటీసులు కూడా పంపారు. కేవలం తన గౌరవానికి, ఇమేజ్ భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత- నాగచైతన్య పేర్లను తీసుకుంటూ కొండా సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా తయారయ్యింది. ఒక మహిళపై ఇలాంటి నిందలు వేయడం సబబుకాదని ఇండస్ట్రీతో పాటు రాజకీయ నేతలు కూడా సమంతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ మంత్రి రోజా సెల్వమణి సైతం సమంతకు అండగా నిలబడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు.
” తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతా పై చేసిన జుగుప్షకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖ పై బీఆర్ఎస్ పార్టీ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన కొండా సురేఖ అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది. మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళ ను తీసుకురావడం దుర్మార్గం ఆ పని మహిలే చేయటం మరింత బాధిస్తోంది. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మనో ధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివర్లో కొండా సురేఖ, అక్కినేని కుటుంబానికి సారీ చెప్పాలని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతా పై చేసిన జుగుప్షకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖ పై @BRSparty అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన @iamkondasurekha అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను…
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 2, 2024