యువతీ యువకుల లైంగిక కలయికలో అపశృతి చోటుచేసుకుంది. ప్రియుడి నిర్లక్ష్యం.. చివరికి ప్రియురాలి మరణానికి దారి తీసింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
నవశరీ జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు తన ప్రియురాలితో లైంగికంగా కలిశాడు. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఆ సమయంలో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాల్సిన అతడు.. సమస్యను అర్థం చేసుకోకుండా యూట్యూబ్‌లో రెమిడీస్ వెతకడం ప్రారంభించాడు. అంతేకాకుండా రక్తం పోతున్నా సరే.. ఆమెతో పదే పదే లైంగికంగా కలిశాడు.
ఒక్క ఆమెకు రక్తస్రావం జరిగి కదల్లేని పరిస్థితుల్లో ఉంటే.. మరోపక్క అతడు గంటల తరబడి యూట్యూబ్‌లో బ్లీడింగ్ ఆపే చిట్కాల కోసం వెతుకుతూ కూర్చున్నాడు. తీవ్రమైన బ్లీడింగ్‌తో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ కాస్త టైమ్‌లో అతడు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌లో చేర్చి ఉంటే.. ఆమె ప్రాణాలతో బయట పడేది.
ఈ ఘటనపై నవశరీ ఎస్పీ సుశీల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘తీవ్ర రక్తస్రావం వల్లే ఆ యువతి మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఆమె ప్రియుడు వెంటనే 108 లేదా మెడికల్ ఎమెర్జెన్సీ సర్వీసులకు కాల్ చేసి కాపాడటానికి బదులు.. తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి సాయం కోరాడు. వాళ్లు వచ్చే వరకు అక్కడే వేచి చూసి.. ఓ ప్రైవేట్ వాహనంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు వెంటనే అత్యవసర చికిత్స, ఫ్లూయిడ్స్, బ్లడ్ ఇచ్చినట్లయితే ఆమె బతికేది. రక్తస్రావం జరుగుతున్నప్పుడు కూడా అతడు ఆమెతో పదే పదే కలిసినట్లు అంగీకరించాడు’’ అని తెలిపారు.
ఇద్దరూ.. అలా కలిశారు
బాధితురాలు.. నర్శింగ్ విద్యార్థిని. మూడేళ్ల కిందట అతడితో పరిచయం ఏర్పడింది. అయితే, ఆ తర్వాత మళ్లీ వారు ఎప్పుడూ కలవలేదు. ఏడు నెలల కిందట మరోసారి అతడిని కలిసింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. సెప్టెంబరు 23న ఇద్దరూ ఏకాంతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. రక్తస్రావం మొదలైన సుమారు 60 నుంచి 90 నిమిషాల వరకు కూడా అతడికి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదు. పదే పదే కలుస్తూ.. యూట్యూబ్‌లో రెమిడీలు వెతుకుతూ.. ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తూ టైమ్ వేస్ట్ చేశాడు. ఆమె చనిపోయిందని భావించి హోటల్‌లో రక్తపు మరకలను క్లిన్ చేసి ఆధారాలను నాశనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ని హత్య చేసిన కస్టమర్.. ఎందుకు చేశాడంటే?..
పోస్ట్‌మార్టం రిపోర్టులో.. ఆమె ప్రైవేట్ పార్టులో గాయాలు ఉన్నాయని తెలిసింది. దానివల్లే ఆమె తీవ్రం రక్తాన్ని కోల్పోయిందని.. ఫలితంగా హెమరేజిక్ షాక్‌కు గురై మరణించిందన్నారు. ఆమె ప్రియుడిపై జలాల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఆ సమయంలో తనకు ఏం చేయాలో తెలియలేదని, తాను కావాలనే ఆధారాలను నాశనం చేశానని అంగీకరించాడు. ఇంత జరుగుతోన్న హోటల్ సిబ్బంది పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు. ఆమెను ఆ స్థితిలో బయటకు ఎలా తీసుకెళ్లారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.