BigTV English

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు.. విశాఖకు ఇండస్ట్రీ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు.. విశాఖకు ఇండస్ట్రీ?

Tollywood Personalities to meet AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టాలీవుడ్ పెద్దలు త్వరలోనే కలవబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. దసరా లోపు పవన్ కల్యాణ్ ను కలవాలని వారు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే, తెలంగాణలో సినీ పరిశ్రమకు గత కొద్దిరోజులుగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పవన్ కల్యాణ్ కు వారు విన్నవించనున్నారని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా ఏపీలోని వైజాగ్ స్టూడియోల నిర్మాణం కోసం అవకాశం కల్పించాలని వారు కోరనున్నారని సినిమా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.


Also Read: పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటో తెలుసా, ప్రొడ్యూసర్ గా కూడా స్క్రీన్ పై పేరు పడింది

కాగా, గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఏపీ వైపు చూస్తున్నారని టాక్. పవన్ కళ్యాణ్‌ను కలిసి.. విశాఖలో సినీ పరిశ్రమకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరునున్నట్లు సమాచారం. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కూడా సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను ప్రస్తావించడంపై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు తమ గోడు విన్నవించుకోవాలని ప్రయత్నిస్తుట్లు సమాచారం. వీటితో పాటు సినిమా ఇండస్ట్రీలో ఇటీవలే చోటు చేసుకున్న అంశాలపై కూడా వారు పవన్ తో చర్చించనున్నారని తెలుస్తోంది. అయితే, విశాఖలో స్టూడియోను ఏర్పాటు చేసినట్లయితే.. ఇండస్ట్రీని విస్తరించడం సాధ్యమవుతుందనే వాదనను కూడా పవన్ తో వినిపించాలని భావిస్తున్నారంటా.


ఇదిలా ఉంటే.. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల తరువాత సినిమా ప్రముఖులు ఆయనను కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా వారు చర్చించారు. ఆ చర్చల్లో ప్రముఖ హీరోయిన్ కూడా పాల్గొన్నారు. ప్రముఖ డైరెక్టర్ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన సుప్రియ కూడా పాల్గొన్న విషయం విధితమే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తో ఆమె దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చాలా ఏళ్ల తరువాత మళ్లీ కలిశారంటూ వార్తలు కూడా వచ్చాయి.

Also Read: చిన్నచూపు చూడొద్దు, రాజకీయ గొడవల్లోకి లాగొద్దు.. కొండా సురేఖ వ్యాఖ్యలకు సమంత కౌంటర్

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×