BigTV English

RRR: జక్కన్న రికార్డ్.. జపాన్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

RRR: జక్కన్న రికార్డ్.. జపాన్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా పేరు ప్రఖ్యాతలు ప్రపంచమంతటా మారుమ్రోగుతున్నాయి. స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచదేశాల్లో ఘన విజయం సాధిస్తోంది. సినిమా వచ్చి 10 నెలలు అవుతున్నా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం దక్కించుకుంది. మూడు నెలల క్రితం జపాన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.


జపాన్‌లో రిలీజ్‌కు ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యామిలీలతో వెళ్లి అక్కడ ప్రమోట్ చేశారు. కొన్ని రోజులపాటు జపాన్‌లో ఉండి భారత్‌లో చేసినట్లుగానే అక్కడ కూడా ప్రమోషన్స్ చేశారు. అక్కడ కలెక్షన్లను కూడా భారీగా వసూల్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’. ఏకంగా రూ.25 కోట్లు వసూల్ చేసి అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన భారతీయ సినిమాగా నిలిచింది.

తాజాగా జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మరో రికార్డ్ సృష్టించింది. జపాన్‌లోని 43 కేంద్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులను పూర్తి చేసుకుంది. జపాన్‌లో 100 రోజులు ఆడిన మొదటి ఇండియన్ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ కెక్కింది. దీంతో చిత్రబృందం, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఈ విషయాన్ని తెలియజేస్తూ రాజమౌళి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు సినిమా 100, 170 రోజులు ఆడిందని వినేవాళ్లం. ఇప్పుడు బిజినెస్‌ల వల్ల అలాంటిది వినడం లేదు. పాత జ్ఞాపకాలు అన్నీ జపాన్ అభిమానులు మళ్లీ గుర్తు చేశారు. లవ్ యూ.. థ్యాంక్యూ జపాన్’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Big Stories

×