Big Stories

Solar Manufacture:చైనా కొత్త వ్యూహం.. ఆ ఎగుమతులకు చెక్..

Solar Manufacture:ఇప్పటికే ఇతర దేశాల సాయం లేకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో టాప్ 1 ప్లేస్‌ను సాధించాలని చైనా కలలు కంటోంది. దానికి తగినట్టుగా పరిశోధనల విషయంలో ఇతర దేశాలకంటే ముందంజలో ఉండాలని చైనా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంలో చైనా ఓ అనూహ్య నిర్ణయానికి వచ్చింది.

- Advertisement -

సోలార్ తయారీ విషయంలో చైనా ఇతర దేశాలకంటే ముందంజలో ఉంది. ఇతర దేశాలు సోలార్‌ను తయారు చేయాలంటే దానికి కావాల్సిన పరికరాలను చాలావరకు చైనా నుండే దిగుమతి చేసుకుంటాయి. ఇదే అవకాశంగా భావించిన చైనా సోలార్ తయారీలో ఆధిపత్యాన్ని చూపించడానికి సిద్ధమయ్యింది. సోలార్ పరికరాలను లేదా నేరుగా సోలార్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం నిషేధించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

సోలార్ వేఫర్స్ తయారీ విషయంలో ప్రజల దగ్గర నుండి సలహాలను స్వీకరిస్తోంది చైనా ప్రభుత్వం. ప్రపంచ దేశాలలో 97 శాతం సోలార్ వేఫర్స్ తయారీ చైనాలోనే జరుగుతోంది. ఈ సోలార్ వేఫర్స్‌ను టెక్నాలజీ పరంగా మరింత ప్రభావితంగా చేయాలని చైనా ఆలోచిస్తోంది. ప్రస్తుతం విద్యుత్తు విషయంలో సోలార్ సంచలనంగా మారింది. చాలామంది దీనిపైనే ఆధారపడుతున్నారు.

ఇండియా, అమెరికాలాంటి దేశాలు సోలార్ కోసం చైనా మీద ఆధారపడకుండా సొంతంగా తయారీ చేపట్టాలని సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే చైనా ఎగుమతులను ఆపివేయాలన్నా నిర్ణయానికి వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. ఇతర దేశాల తమ సాయం లేకుండా సోలార్‌ను ఎలా తయారు చేస్తాయో చైనా పరీక్షించాలనుకుంటోందని వారు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News