Rukmini Vasanth:రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).. ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగు ఆడియన్స్ కొత్త క్రష్ అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు తెలుగువారిని తమ అందచందాలతో విపరీతంగా ఆకట్టుకున్న మలయాళ బ్యూటీలు ఇప్పుడు ఒక్కొక్కరిగా కనుమరుగవుతున్న వేళ.. రంగంలోకి కన్నడ భామలు వచ్చేశారు. ఇప్పుడు వారిదే హవా నడుస్తోంది. మన దర్శక నిర్మాతలు కూడా కన్నడ హీరోయిన్ల వెంట పడుతున్నారు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆశికా రంగనాథ్ (Ashika Ranganath), రష్మిక మందన్న(Rashmika Mandanna), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) ఇలా చాలామంది కన్నడ హీరోయిన్స్ టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘సప్త సాగరాలు దాటి’ అనే మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణీ వసంత్ కూడా చేరిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR), పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అవకాశాన్ని అందుకున్న ఈమెకు.. ఈ ఆఫర్ తో మరిన్ని తెలుగు చిత్రాలు తలుపు తడుతున్నాయి.
చిన్న సందేశం.. నా జీవితాన్నే మార్చేసింది – రుక్మిణీ వసంత్.
ఇకపోతే అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో చెప్పడం అసాధ్యం. ఈ క్రమంలోనే తన అదృష్టం ఎలా మొదలైంది..? తన జీవితం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? అనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చింది రుక్మిణీ వసంత్. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ..”నటన , ప్రతిభ ఉంటే చాలదు. ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఆవగింజంత అదృష్టమైన ఉండాలి. ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం దానిని బాగా నమ్ముతాను. ఉదాహరణకు సప్త సాగరాలు దాటి చిత్రాన్నే తీసుకుందాం. ఇది నా కెరియర్ను మలుపు తిప్పింది. నేను ఈ సినిమా లో హీరోయిన్ కోసం చిత్ర బృందం పెట్టిన ప్రకటన చూసి దర్శకుడికి ఒక మెసేజ్ పెట్టడం వల్లే ఇప్పుడు నాకు నటించే అవకాశం లభించింది. నేను చెప్పేది నిజమే..ఒకరోజు మీ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం అమ్మాయిని వెతుకుతున్నారని ఒక వార్తాపత్రికలో చదివాను. నాకు నటనలో కొంత అనుభవం ఉంది.. మీరు అంగీకరిస్తే నేను ఆడిషన్ లో పాల్గొంటాను అని దర్శకుడికి మెసేజ్ పెట్టాను. అది చూసి ఆయన సరే రండి అని బదులిచ్చారు. కానీ దర్శకుడు నేను పంపించిన మెసేజ్ చదవకపోయి ఉంటే.. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండే దాన్ని కాదేమో.. కాబట్టి ఎంత కష్టపడి పనిచేసినా.. అదృష్టం అనేది కొంచెమైనా ఉంటే మన స్థాయి ఆటోమేటిగ్గా పెరిగిపోతుందనేదే నా అభిప్రాయం” అంటూ రుక్మిణీ వసంత్ చెప్పుకొచ్చింది.
రుక్మిణి వసంత్ సినిమాలు..
కన్నడ ఇండస్ట్రీకి చెందిన రుక్మిణీ వసంత్ కన్నడ చిత్రం “బీర్బల్ ట్రైలాజీ కేసు 1 : ఫైండింగ్ వజ్రముని” అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక తర్వాత కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో అనే కన్నడ చిత్రం తెలుగులో సప్త సాగరాలు దాటి సినిమాగా విడుదలైంది.ఇందులో హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty)కావడం గమనార్హం. హేమంత్ ఎం. రావు (Hemanth M Rao) ఈ సినిమాను తెరకెక్కించారు.
ALSO READ:Sr.NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్.. ఫోటోలు వైరల్!