Triptii Dimri – Sam Merchant : బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి (Triptii Dimri) ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గత కొంతకాలం నుంచి త్రిప్తి దిమ్రి తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడ తిరుగుతున్నా సరే క్షణాల్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ మోడ్ లో ఉంది అనే వార్త వైరల్ అవుతుంది.
‘యానిమల్’ తర్వాత త్రిప్తి దిమ్రి (Triptii Dimri) లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ‘భూల్ భూలయ్యా 3’ సినిమాలో కనిపించిన తృప్తి ఇప్పుడు మంచి ఫేమ్ ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే పర్సనల్ గా కూడా తన లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తోంది. తాజాగా త్రిప్తి దిమ్రి ఇంగ్లాండ్ లో ప్రశాంతంగా హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తోంది. తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను త్రిప్తి దిమ్రి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలలో ఎక్కడా ఆమె బాయ్ ఫ్రెండ్ తో కనిపించలేదు. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలను చూశాక, కాస్త గమనిస్తే ఇద్దరూ ఒకే చోట ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో ఇద్దరూ కలిసే వెకేషన్ కి వెళ్ళారని, కానీ ఫోటోలను మాత్రం వేరు వేరుగా షేర్ చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రీసెంట్ గా నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల (Naga Chaitanya – Sobitha Dhulipala) కూడా ఇలాగే చేశారు. ఒకే చోట వెకేషన్ కు వెళ్ళినప్పటికి ఫోటోలను మాత్రం వేరువేరుగా షేర్ చేశారు. అయినప్పటికీ నెటిజెన్లు వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు అనే విషయాన్ని పట్టేశారు. అయితే ఈ జంట డైరెక్ట్ గా పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేసేదాకా రూమర్స్ గురించి సైలెన్స్ మైంటైన్ చేశారు. ఇప్పుడు త్రిప్తి దిమ్రి (Triptii Dimri) కూడా దాదాపుగా ఇదే పాటర్న్ ఫాలో అవుతుంది. ఇక వీరిద్దరి గురించి రూమర్లు రావడం ఇదే మొదటిసారి కాదు. రీసెంట్ గా ముంబైలో లంచ్ డేట్ లో కూడా కలిసి కనిపించారు. మరి ఈ జంట ఎప్పుడు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతుందో చూడాలి. మొత్తానికి క్రిస్మస్ హాలిడేస్ ను ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుండడం విశేషం. ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు త్రిప్తి దిమ్రి ముంబైలో కూడా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది.
త్రిప్తి దిమ్రి (Triptii Dimri) సినిమాల విషయానికొస్తే… ఆమె కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ‘భూల్ భులయ్యా 3’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తర్వాత సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ‘ధడక్ 2’, షాహిద్ కపూర్‌తో కలిసి విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ సినిమా నటించడానికి సిద్ధంగా ఉంది.