Pushpa 2 Ticket Prices In Telangana: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ఫ 2’ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా మూవీ లవర్స్ అందరిలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలు అన్నింటిని క్యాష్ చేసుకోవాలని ‘పుష్ప 2’ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే టికెట్ ధరలు పెంచుకోవాలని ఫిక్స్ అయ్యారు. కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే టికెట్ ధరలు పెంచుకుంటామన్నా ప్రభుత్వాలు నో చెప్పడం లేదు. ‘పుష్ప 2’ టికెట్ ధరల విషయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక రేంజ్‌లో టికెట్ ధరలు పెంచేసి ప్రేక్షకులకు చుక్కలు చూపించనున్నారు ‘పుష్ప 2’ మేకర్స్.
కాస్ట్‌లీ ప్రీమియర్
డిసెంబర్ 5న ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 4 నుండే ఈ మూవీకి ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఈ ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు చూస్తుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అంత షాకింగ్‌గా అనిపించినా అనిపించకపోయినా ఒక మామూలు మూవీ లవర్ మాత్రం షాక్ అవ్వక తప్పదు. డిసెంబర్ 4న రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండే ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. అర్థరాత్రి 1 గంటకు కూడా ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ప్రీమియర్స్ కోసం సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.1121 ఉండగా.. మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ.1239 ఉంది.
Also Read: ‘పుష్ప 2’ రిలీజ్ కు మరో అడ్డంకి.. ఇలా అవుతుందని ఊహించలేదు..
నెలరోజుల పాటు
‘పుష్ప 2’ ప్రీమియర్ షో టికెట్ ధరల విషయం పక్కన పెడితే.. దాదాపు నెలరోజుల పాటు ఈ సినిమా టికెట్ ధరల పెంపు కొనసాగనుంది. ఈ సినిమా విడుదలయిన నాలుగు రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో ఈ మూవీ టికెట్ ధర రూ.354 కాగా మల్టీప్లెక్స్‌లో దీని టికెట్ ధర రూ.531. నాలుగు రోజుల తర్వాత టికెట్ ధరల్లో మార్పు రానుంది. సినిమా విడుదలయిన 5 రోజుల నుండి 12 రోజుల వరకు ‘పుష్ప 2’ టికెట్ ధర సింగిల్ స్క్రీన్స్‌లో రూ.300 కాగా మల్టీ ప్లెక్స్‌లో 472 కానుంది. ‘పుష్ప 2’ విడుదలయిన దాదాపు రెండు వారాల తర్వాత టికెట్ ధరలు కాస్త మామూలు స్థాయికి చేరుకోనున్నాయి. 13వ రోజు నుండి 29వ రోజు వరకు ఈ సినిమా చూడాలంటే సింగిల్ స్క్రీన్‌లో రూ.200, మల్టీ ప్లెక్స్‌లో రూ.354 పెట్టాల్సిందే.
ఫ్యాన్స్ నమ్మకం
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్‌లో హిట్ అయ్యింది. అందుకే దాని సీక్వెల్‌కు విపరీతమైన క్రేజ్ లభించింది. మొదట్లో ‘పుష్ప’క కూడా మిక్స్‌డ్ టాక్ లభించినా.. ఆ తర్వాత దానికి అందిన విజయం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అందులో అల్లు అర్జున్ డైలాగ్స్, మ్యాననరిజంపై విపరీతమైన రీల్స్ వచ్చాయి. దాంతో సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా పక్కా హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.