Allu Arjun 22 :అల్లు అర్జున్ (Allu Arjun)… ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన..’ పుష్ప 2′ సినిమాతో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక గుర్తింపును అందుకున్నారు. ఎక్కడ చూసినా సరే పుష్పరాజ్ మేనియా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఇకపోతే అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు రాగా. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన భారీ అంచనాల మధ్య అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న #AA 22 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ అనౌన్స్మెంట్ వీడియోని కూడా విడుదల చేశారు..
అల్లు అర్జున్ సినిమాపై రోజుకో వార్త..
ఈ సినిమాతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అటు హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం రంగంలోకి దిగుతున్నాయి. అంతేకాదు కేవలం వీఎఫ్ఎక్స్ కోసమే రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు రాగా అందులో రూ. 170 కోట్లు అల్లు అర్జున్ కే రెమ్యూనరేషన్ గా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే ముంబైలో గప్ చుప్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు రాగా.. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం
సమంత పాయె.. అనన్య పాండే వచ్చే..
నిజానికి ఎన్టీఆర్ (NTR)దేవర(Devara) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉండగా.. మరోవైపు మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా ఇందులో నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అంతలోనే సంయుక్త మీనన్ (Samyuktha menon) పేరు కూడా బయటకు తీశారు. ఇక వీరితో పాటు సమంత (Samantha ) కూడా నటించబోతోంది అంటూ వార్తలు గుప్పించారు. కానీ ఇవేవీ నిజం కాదని తేలిపోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) పేరు వినిపిస్తోంది. ఈ విషయం విని బన్నీ సినిమాపై ఇంకా ఎన్ని గ్రాఫిక్స్ వినాల్సి వస్తుందో.. నిన్నటి వరకు సమంత పేరు వినిపించింది.. ఆమె పోయింది. ఇప్పుడు అనన్య పాండే ని తీసుకొచ్చారా అంటూ పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై పదిరకాల వార్తల వినిపిస్తున్నాయి. కానీ ఇంకా దీనిపై మేకర్స్ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఇందులో బన్నీ డ్యూయల్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు ఇది అతి పెద్ద పండుగని చెప్పవచ్చు.