Leopard In Police station: పోలీస్ స్టేషన్స్ ఎప్పుడూ జనం, ఫిర్యాదులు, నిందితులతో బిజీబిజీగా ఉంటాయి. అయితే.. తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్‌కు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చింది. గెస్ట్‌ను చూసి సంబపడాల్సింది పోయి.. అంతా షాక్ అయ్యారు. ఏం చేయలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గప్ చుప్‌గా కూర్చున్నారు. ఆ గెస్ట్ ఏ వీఐపీనో… సెలబ్రిటీనో అయితే బాగుండేది. కానీ ఆ గెస్ట్‌ను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌లో మాటలు ల్లేవ్.. మాట్లాడుకోవడాల్లు లేవు.. అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఎందుకంటే వచ్చిన గెస్ట్ అలాంటి వారే. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైట్ ఇక డైరెక్ట్‌గా డిటైల్స్‌లోని వెళ్దాం. తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూరు-ఊటీ నేషనల్ హైవేపై ఉన్న పోలీస్ స్టేషన్‌లోకి ఓ చిరుత సడన్ ఎంట్రీ ఇచ్చింది. సరిగ్గా నిన్న రాత్రి 8:30 గంటలకు… ఒక చిరుత పులి మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చింది. కొద్దిసేపు గదిలో కాసేపు అటు ఇటు తిరిగింది. అయితే దానికి ఎవరూ కనిపించలేదు..పైగా దానికి కావాల్సిన భోజనం కూడా దొరలేదు. దీంతో చేసేదేమీలేక.. వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయింది.
ఇక చిరుత పులి లోపలికి వచ్చినప్పుడు.. పక్క గదిలోనే ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. చిరుత లోపలికి రావడం గమనించి సైలెంట్‌గా ఓ మూలన దాక్కున్నాడు. చిరుత బయటకు వెళ్లిపోగానే వెంటనే తలుపు మూసేసి..హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
అయితే చిరుత పులి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెటైర్లు పేలిపోతున్నాయి. ప్రియురాలు మిస్ అయిందంటూ చిరుత కంప్లంట్ ఇచ్చేందుకు వచ్చిందని ఒకరు. మనుషులు వచ్చినా.. జంతువులు వచ్చినా పోలీసు వాళ్లు పట్టించుకోరంటూ ఇంకొందరు. కంప్లంట్ చేసేందుకు వస్తే.. ఎవరూ లేరంటూ ఆవేదనతో చిరుత వెనక్కి వెళ్లిపోయిందంటూ మరొకరు. ఇలా నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై చర్యలు, ఏకంగా…
అయితే.. పులి వెళ్లిపోయాక యథావిధిగా పోలీసులు స్టేషన్‌లోకి వచ్చి విధులు నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తమిళనాడులోని ఓ ప్రాతం అటవీ ప్రాంతానికి చేరువగా ఉంటుంది. అక్కడ ఉండే అభయారణ్యం నుంచి వన్యప్రాణులు తరచూ బయటకు వస్తుంటాయి. అలానే ఈ పులి కూడా వచ్చి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అడవుల్లో ఆహారం, నీటి వసతి కరువుతో వన్య మృగాలు ఊర్లలోకి వస్తుంటాయి. ఇటీవల తరుచూ ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాము. కాగా వన్యప్రాణుల తమకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులను పోలీస్ శాఖ కోరుతోంది.
పోలీస్ స్టేషన్ కు అనుకోని అతిథి!
అచ్చం మనిషిలా పోలీస్ స్టేషన్ కు వచ్చి కలియ తిరిగి వెళ్లిపోయిన చిరుత
తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో ఘటన
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/pHfzLHFf9H
— BIG TV Breaking News (@bigtvtelugu) April 29, 2025