Summer Heat: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. జనం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. వేడి, తేమతో చిన్నా పెద్దా తేడా లేకుండా ఎండల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వేడి నుండి తప్పించుకోవడానికి.. చల్లని పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ మీకు తెలుసా ? మన అమ్మమ్మల కాలం నుండి వేడి నుండి మనల్ని రక్షించడమే కాకుండా తాజాగా ఉంచే సులభమైన, ప్రభావవంతమైన హోం రెమెడీస్ ట్రై చేస్తున్నారు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎండ వేడిమి నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా:
పుదీనా ఎండ వేడికి నిజమైన శత్రువు అని చెప్పవచ్చు. ఇది శరీరానికి తక్షణ చల్లదనాన్ని అందిస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
10-15 పుదీనా ఆకులను తీసుకుని.. వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ రుబ్బిన ఆకులను ఒక గ్లాసు నీటిలో కలిపి, కొద్దిగా నల్ల ఉప్పు వేయండి. దీనిని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగాలి. సమ్మర్ లో ఈ డ్రింక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
కాస్త పుదీనా ఆకులను తీసుకుని వాటిని గ్లాస్ నీటిలో మరిగించండి. నీరు చల్లబడిన తర్వాత.. దానిని మీ ముఖం మీద స్ప్రే చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ, తేనె:
వేసవిలో నిమ్మకాయ నీరు , తేనె కలిపి తాగడం చాలా మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. అంతే కాకుండా తేనె శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఒక గ్లాసు చల్లటి నీటిలో సగం నిమ్మకాయను పిండి జ్యూస్ కలపండి. అందులో ఒక చెంచా తేనె, చిటికెడు నల్ల ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా మీకు ఎప్పుడు నచ్చినా దీన్ని తాగండి. ఇది మిమ్మల్ని ఎండ దెబ్బ నుండి రక్షిస్తుంది . అంతే కాకుండా మీకు తక్షణ శక్తిని అందిస్తుంది.
సోంపు :
ఎండాకాలంలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సోంపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో సోంపు రసం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సోంపు కడుపుని, మొత్తం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఒక టీస్పూన్ సోంపును రాత్రంతా ఒక గ్లాస్ నీటిలో నానబెట్టండి. తర్వాత ఈ నీటిని ఉదయం ఫిల్టర్ చేయండి. అందులో కొంచెం చక్కెర పొడి కలిపి తాగండి. ఇది కడుపులోని వేడిని చల్లబరుస్తుంది. అంతే కాకుండా మీరు తాజాగా ఉండేటట్టు చేస్తుంది.
Also Read: ఈ ఒక్క టీతో.. ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !
కొత్తిమీర:
కొత్తిమీర శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా ఇది ఎండాకాలంలో శరీరానికి అవసరం అయిన పోషకాలను అందిస్తుంది. వేసవిలో కొత్తిమీర తినడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు వేడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని శుభ్రపరుస్తుంది .
ఎలా ఉపయోగించాలి ?
కాస్త తాజా కొత్తిమీర ఆకులను గ్రైండ్ చేసి.. వాటి రసాన్ని తీయండి. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా కొత్తిమీర రసం కలిపి తాగండి.
మీరు రుచి కోసం దీనికి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయవచ్చు. ఇది వేసవిలో మీ కడుపు చల్లగా ఉంటుంది. అంతే కాకుండా రిఫ్రెష్ గా మిమ్మల్ని తయారు చేస్తుంది.