BigTV English

Saba Azad : వెబ్ సిరీస్ కు, హృతిక్ కు ముడిపెడుతూ నెటిజన్ సెటైర్… ఘాటుగా రిప్లై ఇచ్చిన గ్రీక్ గాడ్ గర్ల్ ఫ్రెండ్

Saba Azad : వెబ్ సిరీస్ కు, హృతిక్ కు ముడిపెడుతూ నెటిజన్ సెటైర్… ఘాటుగా రిప్లై ఇచ్చిన గ్రీక్ గాడ్ గర్ల్ ఫ్రెండ్

Saba Azad : గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రస్తుతం నటి, మ్యూజిషియన్ సబా ఆజాద్ (Saba Azad) తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తన భార్య సుసానే ఖాన్ (Sussanne Khan) కు విడాకులు ఇచ్చిన తరువాత హృతిక్ సబా ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ నెటిజన్ ఆమె హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి, పని చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో అతనికి సబా ఘాటుగా సమాధానం చెప్పింది. మరి ఆమె రిప్లై ఏంటో చూసేద్దాం పదండి.


నెటిజన్ కి సబా స్ట్రాంగ్ రిప్లై

ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్న లవ్ బర్డ్స్ లో హృతిక్ రోషన్, సబా ఆజాద్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లినా, లేదంటే కలిసి కనిపించినా సరే… ఆ రోజంతా వాళ్ల గురించే చర్చ నడుస్తుంది. కొన్ని రోజుల క్రితం సబా తన ‘హూ ఈజ్ యువర్ గైనక్’ (Who’s Your Gynac) అనే సిరీస్ కు సంబంధించి రెండవ సీజన్ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ టీజర్ ను షేర్ చేసిన సబా పోస్ట్ కామెంట్స్ లో ఓ నెటిజన్ సరదాగా సెటైర్ వేసి, ఆమె దృష్టిలో పడ్డాడు. కానీ సబా దాన్ని అంత తేలికగా తీసుకోకుండా ఇచ్చి పడేసింది.


“ఈ సీజన్ ఎప్పటికీ రాదని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు సబా ఆజాద్ మేడం జీ గ్రీకు వీరుడి అధికారిక స్నేహితురాలు. కానీ ఇప్పుడు నేను ఈ సీజన్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను” అంటూ కామెంట్ చేశాడు సదరు నెటిజన్. దీంతో సబా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అతడి మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి, షేర్ చేస్తూ “సరే సుమీర్ జీ, అంకుల్ జీ… బహుశా మీరు, మీ ప్రపంచంలో జనాలు ప్రేమలో పడినప్పుడు వారు అసమర్థులైన ఇంటి యజమానులుగా మారతారేమో. తిండి తినడానికి సంపాదించడం మానేస్తారేమో… వాహ్” అంటూ సూటిగా ప్రశ్నించింది.

సినిమాలతో పాటు బ్యాండ్ లోనూ… 

ఇక సినిమాలతో పాటు సబా ఆజాద్ బ్యాడ్ బాయ్ / మింక్ అనే మ్యూజిక్ బ్యాండ్ లో కీలక సభ్యురాలు. అందులో ఆమె ఇమాద్ షా తో కోలాబరేట్ అయింది. గతంలో సబా తన కెరీర్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అప్ అయింది. అందులోనూ హృతిక్ తో ప్రేమలో పడ్డాక మరిన్ని సమస్యలు ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. ఆ టైంలో ఎన్నో వాయిస్ ఓవర్ ప్రాజెక్టులను పోగొట్టుకున్నానని, కొంతమంది చేసుకున్న అపార్థం వల్ల ఇలాంటివి జరిగాయని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా మరోవైపు హృతిక్ ‘వార్ 2’ అనే యాక్షన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో కీ రోల్ పోషిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×