BigTV English

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ ఎంట్రీ.. ఆయన ఏమన్నాడంటే.. ?

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ ఎంట్రీ.. ఆయన ఏమన్నాడంటే.. ?

Sai Dharam Tej: మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా  పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మొత్తంలో తేజ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. 2021 లో తేజ్ కి యాక్సిడెంట్ అయిన విషయం విదితమే. ఈ ప్రమాదం నుంచి ఆయన కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. ఇక ఆ ప్రమాదం తరువాత తేజ్.. విరూపాక్ష  సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని  అందుకుంది.


విరూపాక్ష తరువాత తేజ్.. కథలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు.  మధ్యలో సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాను ప్రకటించారు. కానీ, ఈ సినిమా సెట్స్ మీదనే ఆగిపోయిందని టాక్. ఈలోపు మామ పవన్ ను గెలిపించే పని పెట్టుకున్నాడు. ఏపీ ఎలక్షన్స్  ఎన్నికలప్రచారంలో తేజ్  ఎంతో కష్టపడ్డాడు. ఎట్టకేలకు మామను డిప్యూటీ సీఎం చేయడంలో తనవంతు ప్రయత్నం చేశాడు మెగా మేనల్లుడు. ఇక  ఇదంతా ఒక ఎత్తు అయితే.. అల్లు అర్జున్ ను  అన్ ఫాలో చేసి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు.

Alia Bhatt: అలియాకు పక్షవాతం.. సిగ్గులేదు అంటూ మండిపడ్డ బ్యూటీ


మెగా – అల్లు కుటుంబాల మధ్య వైరం బయటపడడానికి  ఒక కారణం కూడా ఈ హీరోనే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ను కాదని, అల్లు అర్జున్  నంద్యాల పర్యటనకు వెళ్ళినప్పుడే బన్నీని  తేజ్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అన్ ఫాలో చేశాడు. దీంతో  ఈ రెండు కుటుంబమే మధ్య గొడవలు జరుగుతున్నాయని క్లారిటీ వచ్చింది.   ఈ వివాదాన్ని ఇంకా మర్చిపోకముందే.. ప్రణీత్ హన్మంతు వివాదాన్ని బయటకు లాగాడు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని యూట్యూబర్ ప్రణీత్ అతని ఫ్రెండ్స్  అసభ్యంగా వర్ణించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రకంపనలు సృష్టించాడు. వారిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొనేలా చేశాడు.

ఇలా ఈ ఏడాది మొత్తం ట్విట్టర్ లో తేజ్ పేరు ట్రెండింగ్ లో నిలిచింది. అయితే కొంతమంది తేజ్ ను ప్రశంసించారు.. మరికొంతమంది విమర్శించారు. అవేమి పట్టించుకోని మెగా మేనల్లుడు.. తన సినిమాలతో బిజీగా మారాడు.  ఇక తాజాగా తేజ్ ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ABP ఛానెల్ నిర్వహించిన ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 లో పాల్గొన్న తేజ్.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి సంచలన  వ్యాఖ్యలు చేశాడు.

Best Movie in This Week : ఈ రోజు విడుదలైన 7 సినిమాల్లో విన్నర్ ఎవరు..? ఇక్కడ ఓ లుక్ వేయండి.

త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా.. ? అన్న ప్రశ్నకు తేజ్ మాట్లాడుతూ.. ”  ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. కొత్త కొత్త సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నాను. ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. రాజకీయాల్లోకి  రావాలంటే ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ప్రజాసమస్యలపై అవగాహన ఉండాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక తేజ్ కెరీర్ గురించి చెప్పకుంటే.. ప్రస్తుతం SDT18 లో తేజ్ నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రోహిత్ కెపి ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×