BigTV English

Sai Dharam Tej: చెప్పాడు.. చేసాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్

Sai Dharam Tej: చెప్పాడు.. చేసాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్

PawanKalyan – Sai Dharam Tej: 2024 ఏపీ ఎన్నికలలో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల ఫలితాలలో అత్యధిక మెజార్టీతో గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో ‘కూటమి’ భారీ విజయాన్ని కైవసం చేసుకుబోతోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఊహించని భారీ మెజార్టీతో ముందు వరుసలో ఉన్నారు.


ఇంచు మించు ఆయన విజయం ఖాయమైపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మెజారిటీ వెయ్యి రెండువేలు కాదు.. ఏకంగా 50వేల ఓట్లకు పైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు. దీంతో సినీ అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు హీరోలు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా పవన్‌కు సంబంధించి చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘‘చెప్పాడు.. చేసాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా మరొక ట్వీట్ కూడా చేశాడు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత & భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది’’ అంటూ పవర్ స్టార్ ఫొటోతో ట్వీట్ చేశాడు.


Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు.. ఎన్ని సినిమాలు / సిరీస్‌లంటే..

అలాగే సాయి ధరమ్ తేజ్‌తో పాటు మరికొందరు తమ దైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ విజయం సాధించడంతో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారోత్సవ బాధ్యతలను దర్శకుడు బోయపాటికి అప్పగించినట్లు తెలుస్తోంది.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×