BigTV English

This Week Theatre and OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు.. ఎన్ని సినిమాలు / సిరీస్‌లంటే..

This Week Theatre and OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు.. ఎన్ని సినిమాలు / సిరీస్‌లంటే..

june 1st week movies and web series will be released in theatre and OTT List: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్ / ఓటీటీలో సినిమాలు, సిరీస్‌ల హవా కనిపించనుంది. కొత్త సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్ సందడి ముగియడంతో ఇక నుంచి సినిమాలు, సిరీస్‌లతో సందడి వాతావరణం కొనసాగనుంది. మరి జూన్ మొదటి వారంలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లేవో ఇప్పుడు తెలుసుకుందాం.


మనమే

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్‌ ఈ సారి మంచి హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘మనమే’ మూవీ చేస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. మంచి అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో జూన్ 7న రిలీజ్ కానుంది.


వెపన్‌

గుహన్‌ సెన్నియ్యప్పన్‌ రూపొందించిన లేటెస్ట్ చిత్రం ‘వెపన్‌’. సత్యరాజ్‌, వసంత్‌ రవి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం హాలీవుడ్ డీసీ, మార్వెల్‌ తరహాలో ఉంటుందని దర్శకుడు ఇటీవల తెలిపాడు. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: హాస్పిటల్‌లో చేరిన బండ్ల గణేష్.. వీడియో వైరల్..

రక్షణ

కొత్త కొత్త పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న పాయల్ రాజ్ పుత్.. రొమాంటిక్ సీన్లతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటి వరకు చేయని పాత్రలో పాయల్ కొత్త సినిమాతో వస్తోంది. ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘రక్షణ’. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటిస్తుంది. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సత్యభామ

పెళైన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సినిమాలలో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడొక లేడీ ఓరియేంటెడ్ మూవీ చేస్తోంది. కాజల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘సత్యభామ’. ప్రముఖ డైరెక్టర్ సుమన్‌ చిక్కాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.

లవ్‌ మౌళి

టాలీవుడ్ యంగ్ నటుడు నవదీప్‌ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ఇదెక్కడి మాస్ రా మావ.. సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులే.. కానీ ఇప్పుడు షూటింగా..!

ఓటీటీ చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు

డిస్నీ+హాట్‌స్టార్‌

జూన్‌ 05 – గునాహ్‌(హిందీ సిరీస్‌)
జూన్‌ 04 – క్లిప్ప్‌డ్‌(వెబ్‌సిరీస్)
జూన్‌ 04 – స్టార్‌వార్స్‌:ది ఎకోలైట్‌(సిరీస్)
జూన్‌ 05- ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌(హిందీ సిరీస్‌)

నెట్‌ఫ్లిక్స్‌

జూన్‌ 03 – షూటింగ్‌ స్టార్స్‌ (హాలీవుడ్)
జూన్‌ 05 – హిట్లర్‌ అండ్‌ నాజీస్‌(వెబ్‌సిరీస్‌)
జూన్‌ 05 – హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ (హాలీవుడ్)
జూన్‌ 06 – బడేమియా ఛోటేమియా(హిందీ)
జూన్‌ 06 – స్వీట్‌ టూత్‌ (సిరీస్)
జూన్‌ 07 – హిట్‌‌మ్యాన్‌ (హాలీవుడ్)
జూన్‌ 07 – పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌-2(వెబ్‌సిరీస్‌)

సోనీలివ్‌

జూన్‌ 07 – గుల్లక్‌ (హిందీసిరీస్‌)
జూన్‌ 07 – వర్షన్గల్కు శేషం(మలయాళం)

ఆహా

జూన్‌ 07 -బూమర్‌ అంకుల్‌ (తమిళ)

అమెజాన్‌ ప్రైమ్‌

జూన్‌ 05 – మైదాన్‌(హిందీ)

Also Read: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్?

బుక్‌ మైషో

జూన్‌ 07- ఎబిగైల్‌(హాలీవుడ్)

జియోసినిమా

జూన్‌ 07 – బ్లాక్‌ అవుట్‌‌(హిందీ)

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×